Asianet News TeluguAsianet News Telugu

సచిన్ పైలట్ ఘర్ వాపసీ: బిజెపి నేత వసుంధర రాజేదే అసలు పాత్ర

బీజేపీ పాలిత రాష్ట్రంలో ఆశ్రయం పొంది, బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపణలు చేస్తూ, అది కూడా స్వయంగా కేంద్రమంత్రిపై ఆరోపణలు చేస్తూ...కేసులు నమోదు చేసిన వేళ... అంతా కూడా సచిన్ పైలట్ బీజేపీ క్యాంపుకి దగ్గరయ్యాడు అని భావించారు. 

Sachin Pilot Ghar Wapsi: Vasundhara Raje Turned The key
Author
Jaipur, First Published Aug 11, 2020, 10:32 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. సచిన్ పైలట్ ఘర్ వాపసీ జరిగిపోయింది. ఆయన నిన్న రాహుల్ గాంధీని కలవడంతో ఈ మొత్తం సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. గత నెలరోజులుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. 

సచిన్ పైలట్ వెనక్కి రావడం కన్నా, అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం ఇంకొకటి ఉంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేతిలో ఉన్నప్పటికీ.... బీజేపీ రాజస్థాన్ లో మరో మధ్యప్రదేశ్ ఫీటును ఎందుకు చేయలేకపోయింది అని..?

బీజేపీ రాజస్థాన్ లో ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు అని అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ప్రశ్న. పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో.... వెళ్లి కూర్చుంది హర్యానాలోని ఒక రిసార్టులో. ఆ రిసార్టుపై కరోనా క్వారంటైన్ కేంద్రం అనే స్టిక్కర్ ని కూడా అంటించింది అక్కడి ప్రభుత్వం. మొన్న రాజస్థాన్ పోలీసులు వారిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. 

బీజేపీ పాలిత రాష్ట్రంలో ఆశ్రయం పొంది, బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపణలు చేస్తూ, అది కూడా స్వయంగా కేంద్రమంత్రిపై ఆరోపణలు చేస్తూ...కేసులు నమోదు చేసిన వేళ... అంతా కూడా సచిన్ పైలట్ బీజేపీ క్యాంపుకి దగ్గరయ్యాడు అని భావించారు. 

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా సచిన్ పైలోట్ పై అనేక తీవ్రమైన ఆరోపణలు చేసాడు. ఆయనను నికమ్మ (పనికిరానివాడు) అంటూ, ఇంగ్లీష్ మాట్లాడినంతమాత్రాన నాయకుడయిపోడు అంటూ అనేక వ్యాఖ్యలు చేసాడు. 

ఈ అన్ని పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ కి వెనక్కి వచ్చే ద్వారాలన్నీ మూసుకుపోయాయి అని అంతా భావించారు. తాను బీజేపీలో చేరను అని సచిన్ పైలట్ పదే పదే చెబుతున్నప్పటికీ.... ఎవరు ఆయన మాటను మాత్రం నమ్మలేదు. దానికి తోడు ఆయన రాహుల్ గాంధీని కలిసేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడం, ప్రియాంక గాంధీ ఫోన్ లో మాట్లాడినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తాడన్న నమ్మకం ఎవరికీ లేకుండా పోయింది. 

ఇక ఈ పరిస్థితులు కొనసాగుతుండగానే ఈడీ రైడ్లు రాజస్థాన్ లో కలకలం సృష్టించాయి. అశోక్ గెహ్లాట్ సోదరుడి ఆస్తులపై సోదాలు జరగడం అన్ని వెరసి బీజేపీ ఇక్కడ గేమ్ ప్లాన్ మొదలు పెట్టింది అని అంతా నమ్మారు. మరో రాష్ట్రం కూడా కాంగ్రెస్ చేజారిపోయినట్టే అని విశ్లేషకులు లెక్కలేసారు. 

కానీ అనూహ్యంగా పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం వసుంధరే రాజే గా తెలియవస్తుంది. ఆమె గతంలో రాష్ట్రంలో రాజకీయాలకన్నా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యమని ట్వీట్ చేసారు. 

ఆమె ఏ కోణంలో కూడా రాష్ట్రంలో ఈ తరహా అధికార మార్పుకు సుముఖంగా లేరు. ఈ తరహాలో గనుక అధికారం చేబడితే.... అప్పుడు బీజేపీ ముఖ్యమంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ వంటివారు పీఠాన్ని అధిరోహింహేవారు. అందుకు మాజీ సీఎం వసుంధర రాజే సింధియా ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు. 

మిగిలిన అన్ని రాష్ట్రలొకలెక్క రాజస్థాన్ ఒక లెక్క. అక్కడ ప్రాంతీయ నాయకుల హవా అధికం. వసుంధరే రాజే వర్గం ఎమ్మెల్యేలు పూర్తిగా కేవలం ఆమె మద్దతు దారులే. వారు ఎప్పటికైనా ఆమె వెంట నడవడానికి సిద్ధపడతారు. సచిన్ పైలట్ విషయంలో కూడా మనం చూసింది అదే. 

200 సీట్లు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ బలం 72 మంది ఎమ్మెల్యేలు. వీరిలో 45 మంది వసుంధర రాజే సింధియా వర్గీయులే. ఆమెను కాదని బీజేపీ రాజస్థాన్ లో ఏమి చేయలేదు. ఆ పరిస్థితుల్లోనే బీజేపీ రాజస్థాన్ పై ఆశలు వదులుకొని దూరంగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చింది. 

ఇక పైలట్ ని సైతం కాంగ్రెస్ వెనక్కి స్వీకరించింది. అంతర్గత వ్యవహారమని తేల్చేసింది. పైలట్ సమస్యలను అర్జెంటు గా పరిగణిస్తామని హామీ ఇస్తూనే.... ఆయనను రాష్ట్రం నుంచి కేంద్ర నాయకత్వంలోకి వచ్చేయమని చెప్పినట్టు తెలుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios