Asianet News TeluguAsianet News Telugu

శిద్ధా రాఘవరావు వైసీపీలోకి వెళ్లడం వెనక...., మరికొందరు కూడా

తాజాగా మరో సీనియర్ నేత శిద్ధా రాఘవరావు కూడా కుమారుడితో కలిసి నేడో రేపో వైసీపీలో చేరుతారనేది తాజా సమాచారం. మామూలుగా అయితే వైసీపీ అధికారంలోకి రాగానే నేతలు చేరి ఉంటే.... అధికారం కోసం అని భావించవచ్చు. కానీ సంవత్సర కాలం పూర్తయ్యాక ఇలా చేరుతుండుండడం వారి ఆర్ధిక మూలాలపై పడ్డ దెబ్బల కారణంగానే వారు ఇలా పార్టీలను మారుతున్నారని వారి సన్నిహితులు అంటున్నారు. 

Reason For Sidda Raghava Rao Shifting To YCP, Others To Follow The Suit
Author
Amaravathi, First Published Jun 9, 2020, 6:01 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వలస వెళుతున్న నేతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ చేరికతో మొదలైన ఫిరాయింపులు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రకాశం జిల్లా సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 

తాజాగా మరో సీనియర్ నేత శిద్ధా రాఘవరావు కూడా కుమారుడితో కలిసి నేడో రేపో వైసీపీలో చేరుతారనేది తాజా సమాచారం. మామూలుగా అయితే వైసీపీ అధికారంలోకి రాగానే నేతలు చేరి ఉంటే.... అధికారం కోసం అని భావించవచ్చు. కానీ సంవత్సర కాలం పూర్తయ్యాక ఇలా చేరుతుండుండడం వారి ఆర్ధిక మూలాలపై పడ్డ దెబ్బల కారణంగానే వారు ఇలా పార్టీలను మారుతున్నారని వారి సన్నిహితులు అంటున్నారు. 

పార్టీలను మారినవారు అనేక కారణాలను చెబుతున్నప్పటికీ.... అసలు కారణం మాత్రం ఆర్ధిక మూలాలు కుదేలవుతుండడమే అనేది సన్నిహిత వర్గాలు చెబుతున్నమాట. ఇప్పటికే అనేక మార్లు ప్రయోగించిన ఆపరేషన్ ఆకర్ష్ విఫలం చెందడంతో ఇప్పుడు వైసీపీ వర్గాలు ఇలా వారి ఆర్థికమూలలను దెబ్బకొట్టేందుకు చూస్తున్నాయని అంటుంది. 

శిద్ధా రాఘవరావుతో సహా మరికొందరు ప్రకాశం జిల్లాకు చెందిన నేతలపై కూడా ఇలాంటి ఒత్తిళ్లే వస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఆ ఇతర నేతలు, ఏమిటా ఒత్తిళ్లు అనేది చూద్దాము. 

తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర కోశాధికారి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, అడ్డంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులను వైసీపీ తమవైపుకు తిప్పుకోవాలని చూస్తుంది. ఈ ముగ్గురు నేతలు ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు కావడమే కాకుండా... అందరూ కూడా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నవారే. 

గ్రానైట్ తీయొచ్చు గానీ ఎగుమతి చేసేందుకు పర్మిట్లు ఇవ్వటాన్ని మాత్రం నిలిపివేశారని తెలియవచ్చింది. ఇలా బెదిరింపులు వస్తున్నాయని వారు సన్నిహితులతో వాపోతున్నారు. ఈ బెదిరింపులన్నీ కూడా మౌఖికంగామాత్రమే వస్తున్నాయట. 

గ్రానైట్ ఎగుమతులు లేనిపక్షంలో భారీ ఆర్థిక నష్టాలు తథ్యం. వెలికితీసిన గ్రానైట్ కి విదేశీ మార్కెట్ అధికంగా ఉంటుంది.ఎగుమతులు నిలిపివేయమని మౌఖిక ఆదేశాలు మాత్రమే లభిస్తున్నాయట. అంతే తప్ప నోటీసులు మాత్రం ఇవ్వడంలేదట. కొన్ని తెలుగు పత్రికల కథనం ప్రకారమయితే అధికారులు కూడా తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తూ... తమపై ఒత్తిడి ఉందని, అర్థం చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతున్నారట. 

ఇక ఇలా ఎగుమతులను ఆపమనడంతోపాటుగా పర్మిట్లపై కూడా దెబ్బ కొట్టే ఆస్కారముందని సదరు నేతలు వాపోతున్నారట. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నాక, క్వారీని పరిశీలించి పర్మిట్లు ఇస్తారు. పర్మిట్ల విషయంలో తమకు అన్యాయం జరిగే ఆస్కారముందని వారు వాపోతున్నారు. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా చెప్పండి.

ఇతరపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి చేరాల్సిందే అన్న  జగన్ వారిని రాజీనామా అవసరం లేకుండానే తీసుకుంటున్నారు. ఈ ప్రస్తుత నేతలు ఎమ్మెల్యేలు కాకపోవచ్చు, కానీ ఈ ప్రాస్తుత ఫిరాయింపులను చూస్తుంటే... గత చంద్రబాబు ప్రభుత్వానికి, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి మధ్య పెద్ద తేడా లేనట్టుగానే కనబడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios