ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో.... ప్రత్యర్థులకు పరాజయమే

ప్రశాంత్ కిశోర్ వ్యూహాల ముందు రాజకీయ ప్రత్యర్థులు పరాజయాలను మూటగట్టుకున్నారు. తాజాగా, ఆయన వ్యూహకర్తగా వ్యవహరించిన టీఎంసీ, డీఎంకె విజయాలు సాధించాయి.

Political rivals  face defeat before Prashant Kishor strategies

ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న పేరు. ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ తన సత్తా చాటి తమను తీసుకున్న రాజకీయ పార్టీ కి తిరుగులేని విజయాన్ని అందిస్తుంది. ప్రశాంత్ కిషోర్ ఏదైనా రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి పని చేస్తున్నాడంటే ప్రత్యర్థులు గెలుపు ఆశలు వదులుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది.  

ఇప్పటికె పలు రాష్ట్రాలలో ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీకి అతి పెద్ద మెజారిటీ విజయం సాధించి పెట్టిన ప్రశాంత్ కిషోర్ టీమ్ ఇప్పుడు మళ్ళీ వెస్ట్ బెంగాల్ లో రాజకీయ ప్రత్యర్థులకు చెమటలు పుట్టించింది. ప్రశాంత్ కిషోర్ తృణమూల్ కాంగ్రెస్ తో పని చేస్తున్న విషయం అందరికి విదితమే. ముందునుండి వెస్ట్ బెంగాల్ లో మమత విజయం పట్ల ధీమా గా ఉన్న ప్రశాంత్ ఏకంగా హోంమంత్రి అమిత్ షా కే తనదైన సవాలు విసిరాడు. వెస్ట్ బెంగాల్ లో బిజెపి డబల్ డిజిట్ కూడా దాటదని, ఒకవేళ దాటితే ఈ వేదిక నుండి తప్పుకుంటానని  సవాలు విసిరి దేశ వ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ రాజకీయం పట్ల ఆసక్తిని రేకెత్తించాడు. 

ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ టీమ్ వ్యూహాలు వెస్ట్ బెంగాల్ లో మమత బెనర్జీ ను ఘన విజయం దిశగా దూసుకెళ్లేలా చేశాయి. బెంగాల్ లో వినూత్న క్యాంపెయిన్ లతో ప్రశాంత్ కిషోర్ టీమ్ ముందు నుండి చురుగ్గా వ్యవహరించింది. ఆ వ్యూహాలే మమత కు అదనపు బలాలుగా నిలిచాయి. స్థానికంగా ప్రజల మనస్సుల్లో వివిధ క్యాపెయిన్ లతో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత పట్ల ఒక రకమైన సానుకూలత తీసుకురావడంతో తృణమూల్ కాంగ్రెస్ విజయం నల్లేరు పై నడకె అయ్యింది. ఏది ఏమైనా దేశ వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయాల పరంగా ఒక ట్రెండ్ ను సృష్టిస్తున్నాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios