తెలంగాణ రాబిన్ హుడ్ పాత్రలో పవన్ కళ్యాణ్.... ఈ పండుగల సాయన్న ఎవరు?
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఒక చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డట్టు తెలుస్తుంది. క్రిష్ దర్శకత్వంలో తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరున్న పండుగల సాయన్న పాత్రను పవన్ చేయబోతున్నాడట.
తెలుగు సినిమాల్లో ఈ మధ్య చారిత్రాత్మక కథాంశాల ఆధారంగా కథలను అల్లడం ఎక్కువయింది. మరుగున పడిపోతున్న చరిత్రను భావితరాలకు అందించడంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఇటీవల విడుదలైన సైరా అయినా సరే... నిర్మాణ దశలో ఉన్న ఆర్ ఆర్ ఆర్ అయినా సరే ఇవన్నీ కూడా మన గత చరిత్ర వైభవాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూసే అవకాశాన్ని కల్పిస్తాయి.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ఒక చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలో నటించేందుకు సిద్ధపడ్డట్టు తెలుస్తుంది. క్రిష్ దర్శకత్వంలో తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరున్న పండుగల సాయన్న పాత్రను పవన్ చేయబోతున్నాడట.
ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ నిండా అసలు ఈ పండుగల సాయన్న చరిత్ర కోసం విపరీతమైన సెర్చ్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. ఈ సినిమా వార్త బయటకొచ్చిన నేపథ్యంలో అసలు ఈ పండుగల సాయన్న ఎవరు ఆయన నేపధ్ఏమిటి? ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడో ఒకసారి మనమూ ఆయన చరిత్ర తెలుసుకుందాం.
పండుగల సాయన్న లేదా పండగల సాయన్నను తెలంగాణ రాబిన్ హుడ్ గా పేర్కొంటారు. ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వాడు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయన్న పేదవాళ్ల కష్టాలను చూసి తట్టుకోలేకపోయేవాడు. వారికోసం ఏదో ఒకటి చేయాలనీ నిత్యం పరితపిస్తూ ఉండేవాడు.
అతనిపేరు చెబితేనే నిజాం ప్రభుత్వానికి వణుకు పుట్టేది. వెనకబడ్డ వర్గంలోనే వెనకబడ్డవారు ఆడవారిని బలంగా నమ్మి వారి పెండ్లిలా కోసం పుస్తెలు సైతం అందించేవాడు పండుగోళ్ల సాయన్న.
సాయన్న జననం.... జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు సాయన్న. అప్పటి నిజాం ప్రభుత్వం మొహర్రం రాష్ట్రపండగా జరపమని ఆదేశాలు జారీ చేసిన సంవత్సరంలో మొహర్రం పండగనాడు ఆయన జన్మించారు.
అలా మొహర్రం పండగ నాడు జన్మించడంతో... ప్రతి సంవత్సరం కూడా కందూరు చేయాలనీ అతడి తల్లి మొక్కింది. ఆ కందూరు కార్యక్రమాన్ని తాను మరణించే వరకు కొనసాగించాడు సాయన్న.
Also read: PSPK27: ఉన్నోళ్లని కొట్టిండు.. లేనోళ్లకి పెట్టిండు!
ఇలా ఒకసంవత్సరం కందూరు కోసమని తాండూరు వెళ్లే దారిలో దారి కాచి గొల్ల చెన్నయ్య దగ్గరి నుండి 6 గొర్రెలను, ఒక పుట్టెడు ధాన్యాన్ని దొంగిలించాడు. తాను పేదవాడినంటూ, ఇంటి దగ్గర తాను చూసుజకోవాలిసిన ఒక కుటుంబముందని చెన్నయ్య సాయన్నను బ్రతిమిలాడాడు.
సాయన్న కాళ్ళు పట్టుకొని చెన్నయ్య బ్రతిమిలాడడంతో అతడి దగ్గరి నుండి లూటీ చేసిన సామాన్లు అతనికి ఇచ్చేసి, జమీందారు వెంకట్ రెడ్డి దగ్గరి నుండి తనకు కావలిసినవి దొంగిలించి పేదలకు పెద్ద ఎత్హున దావత్ ఇచ్చాడు.
ఈ తరుణంలోనే ఇలా అలంటి భూస్వాములు అంతంత ఆస్తి ఎలా కూడబెడుతున్నారో అతడికి ఆశ్చర్యాన్ని కలుగజేస్తే... సమాజంలో పెద్ద ధనిక అసమానతలు అతడిలో ఆందోళనను కలిగించాయి.
సమాజంలో పెద్ద ధనిక తేడాను చెరిపేయాలంటే... ఉన్నోడిని కొట్టి లేనోడికి పెట్టాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అలా అతడు పేదలకోసం దొంగతనాలను చేస్తూ దొంగలించిన సొమ్మును పేదలకు పంచుతూ... తెలంగాణ రాబిన్ హుడ్ గా ఎదిగాడు.
ఇతడి పనుల వల్ల భూస్వాములు భయభ్రఅంథులకు గురవడమే కాకుండా సాయన్నపై పగా సాధించాలని నిశ్చయించుకున్నారు. అలా నిజాం పోలీసులతో కలిసి అతడి భార్యను భయపెట్టి అతడిని పట్టుకున్నారు.
6 అడుగుల రూపం, చెవుల వరకు పెంచిన మీసం, కండలు తిరిగిన దేహం మొత్తంగా ఒక పెద్దపులి వలే ఉన్న సాయన్న దగ్గరకు రావడానికి అందరూ జంకారు. అతడిని ఒక ఇనుప బోనులో బంధించారు. అతగాడి తలను నరికితే తప్ప తమ ఆస్తులకు రక్షణ లేదని భావించిన జమీందారులు అందుకు సిద్ధపడ్డారు.
అప్పటి వనపర్తి సంస్థానం రాణి, శంకరమ్మ సాయన్న లూటీ చేసినంత డబ్బు దాదాపుగా 10 వేల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు చెల్లించడానికి సిద్ధపడ్డప్పటికీ కూడా కూఫియా పోలీసులు ఆయన్ను విడిచిపెట్టలేదు.
చివరకు తానే తన తలను నరకడానికి నియమించిన వెంకన్నను పిచ్చి నరకమని చెప్పాడు. అలా ఒక గొప్ప యోధుడు అస్తమించాడు. ఇప్పటికి కిన్నెర వాయిద్యాలతో ఆయన కథను డక్కలి కులస్థులు గానం చేస్తూనే ఉంటారు. అలంటి యోధుడిపైన సినిమా తీస్తుండడం నిజంగా మన అదృష్టం.