2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలదని విశ్వసించిన ప్రజలకు నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. ఎన్నో కోణాల్లో ఇప్పుడున్న అధికార ప్రభుత్వం విఫలమయ్యిందని చెప్పటానికి ఎలాంటి సంశయం అక్కరలేదు. చంద్రబాబుకు ఉన్న అనుభవం అభివృద్ధి వైపు అడుగులేమో కానీ ఇంకా అధఃపాతాళంలోకి వెళ్ళింది. 

అద్భుతమైన అమరావతి అంటూ అదరగొట్టి ఊదరగొట్టిన బాబు రాజధానిని కేవలం గ్రాఫిక్స్ లలో  చూపించటంతోనే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం గడిచిపోయింది. సగటు ఆంధ్రుని పరిస్థితి అద్వాన్నంగా తయారయ్యింది. జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలు రాష్ట్రానికి మేలవుతాయని ప్రజలు భావించినప్పటికీ ఆంధ్రుల ఆశలు ఆవిరయ్యాయి.

బిజెపితో నాలుగు సంవత్సరాలు అధికార పొత్తు నడిపి ఏంన్నికల సంవత్సరాలోకి రాగానే బిజెపి మోసం చేసిందంటూ మల్లి కాంగ్రెస్ తో జత కట్టిన బాబు విశ్వసనీయత కోల్పోగా బాబు ప్రతిష్టని మసకబార్చిందనే చెప్పవచ్చు. 

రాష్ట్ర ప్రతిపక్షనేత జగన్ చంద్రబాబు వైఫల్యాలను ఎప్పటికపుడు ఎత్తి చూపుతూ ప్రభుత్వాన్ని ఎండగట్టడం ప్రజలు జగన్ వైపు మల్లెలా చేసింది. అప్పటికే ప్రజాబలమున్న నేతగా ఉన్న జగన్ కు చంద్రబాబు చేష్టలతో మరింత ప్రజాదరణ తోడయ్యింది. జగన్ కి ఉన్న ప్రజాబలం ముందు చంద్రబాబు అనుభవం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనటంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇదే విషయం తెలంగాణ ఎన్నికల్లోనూ నిరూపితమైంది. కూటమి పేరుతో చంద్రబాబు పలు పార్టీ లతో కలిసి పొత్తు పెట్టుకొని ఒక బలంగా తెలంగాణ ప్రజల ముందు ప చేసినప్పటికీ తెలంగాణ ప్రజలు చంద్రబాబుని అత్యంత ఘోరంగా తిరస్కరించి అమరావతి పంపకనే పంపారు. 

చంద్రబాబు తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఒంటరిగా ఎన్నికల్లో తలపడలేదు, ఎప్పుడు కూడా ఏదో ఒక పార్టీతో జత కూడి ఎన్నికలకు వెళ్లారు. కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాలు మాత్రం చంద్రబాబుకు చెంపపెట్టు లాంటివి. ఎందుకంటే దీనికి బలమైన కారణాలు ఉన్నాయి. చంద్రబాబు తాను అధికారం చేపట్టిన ఆంధ్రప్రదేశ్ కే సరైన న్యాయం చేయలేదనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో కూడా ఉంది. 

ప్రత్యేక హోదా విషయంలో ఎన్నో సార్లు పలు మాటలు మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే విషయంలో పూర్తిగా విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఇదే విషయంలో ఆ రాష్ట్ర ప్రతిపక్షనేత జగన్ ఒకే స్టాండ్ పై నిలబడి ప్రజల ఆదరణ చూరగొన్నాడు. అందుకే జగన్ కి ప్రజా బలం రెట్టింపయ్యింది. రోజురోజుకూ జగన్ కి ఉన్న ప్రజాదరణ ముందు 40 ఏళ్ళ అనుభవం అభాసుపాలవుతుంది. ఇది చంద్రబాబు వేసే పలు రూపాలకు, మాట్లాడే పలు మాటలకు ఒక గుణపాఠం లాంటిదని చెప్పవచ్చు.

- హరినాథ్