దీదీ ఓ దీదీ: పశ్చిమ బెంగాల్ లో బెడిసికొట్టిన బిజెపి ప్లాన్

ప్రధాని మోడీ దీదీ ఓ దీదీ అంటూ కామెంట్స్ పాస్ చేయడం ప్రజలకు అంతగా రుచించలేదు. ముఖ్యంగా మహిళలకు. మహిళాసాధికారతపై మమతా బాగానే ఫోకస్ పెట్టారు. కానీ మమతను అలా అనేసరికి అది మహిళా ఓట్లపై భారీగా దెబ్బ కొట్టింది

Modis Didi O Didi taunt have actually back fired in bengal

బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ సర్కారు అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2016లో సాధించిన సీట్లకన్నా అధికంగా సాధించి మూడవ పర్యాయం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు మమతా బెనర్జీ. ఒపీనియన్ పోల్స్ నుంచి ఎగ్జిట్ పోల్స్ వరకు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మమతా 200 మార్కును దాటడం రాజకీయ పండితులకు కూడా అంచనాలకు అందడం లేదు. మమతా గెలుస్తుందని కొందరు చెప్పినప్పటికీ... ఇంత భారీ విజయం సాధించడం మాత్రం ఎవరూ ఊహించలేదు. 

మమతా బెనర్జీ ఇక్కడ గెలవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనబడుతున్నాయి. మమతా తన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి తన ప్రచారాన్ని చాలా ప్లాన్డ్ గా ప్రిపేర్ చేసుకున్నారు. ఆమె ఎక్కడా కూడా తన టెంపరమెంట్ ని కోల్పోకుండా బీజేపీకి వారి స్టైల్ లో స్ట్రీట్ ఫైటర్ లా పోరాడి ఎన్నికల్లో విజయం సాధించారు. మమతా బెనర్జీ మీద గెలవడానికి బీజేపీ తమ సమస్త శక్తులను ఒడ్డినప్పటికీ... అది సాధ్యపడలేదు. 

ప్రతిరోజు అమిత్ షా, రెండు రోజులకొకసారి మోడీ, ఇతర బీజేపీ మంత్రులు, నడ్డా ఇలా ప్రతి ఒక్కరు బెంగాల్ లో పర్యటించారు. కాలు విరిగి వీల్ చైర్ లో కూర్చున్న మమతా పై పూర్తి బీజేపీ బలం, బాలగంతో దిగిపోయింది. మమతా చాలా తెలివిగా ఇక్కడ విక్టిమ్ కార్డు ప్లే చేసింది. ఒక ఒంటరి మహిళా పైకి ఇంతమందా అన్నట్టుగా ఒక అండర్ డాగ్ ఇమేజ్ తో ప్రజల్లోకి వెళ్ళింది. ఢిల్లీలో కేజ్రీవాల్ విషయంలో కూడా జరిగింది ఇదే..!

ఇక ఎన్నికలకు ముందు టీఎంసీ నేతలను బీజేపీ భారీగా పార్టీలో చేర్చుకుంది. అన్ని రకాలుగా మమతను ఇబ్బందులకు గురిచేసి ఆ పార్టీలోని ఎమ్మెల్యేలను తమ వైపుకు లాక్కున్నారు. ఇలా చేయడం వల్ల కూడా సెంటిమెంటు మమతా వైపుగా మళ్లింది. ఇదే తరహా పరిస్థితిని మనం మహారాష్ట్రలో ఎన్సీపీ విషయంలో బీజేపీ చేయడం చూసాం. వర్షంలో శరద్ పవార్ మాట్లాడడం ఒక్క దెబ్బకు మహారాష్ట్రలో శరద్ పవార్ పార్టీ అనూహ్యమైన సీట్లలో విజయం సాధించింది. మరోసారి పాలిటిక్స్ అఫ్ ఆప్టిక్స్ ఇక్కడ కూడా పనిచేసాయి. 

మరొక అంశం ప్రధాని మోడీ దీదీ ఓ దీదీ అంటూ కామెంట్స్ పాస్ చేయడం ప్రజలకు అంతగా రుచించలేదు. ముఖ్యంగా మహిళలకు. మహిళాసాధికారతపై మమతా బాగానే ఫోకస్ పెట్టారు. కానీ మమతను అలా అనేసరికి అది మహిళా ఓట్లపై భారీగా దెబ్బ కొట్టింది. సభలో శ్రేణులు  ఉండొచ్చు, కానీ వారంతా బీజేపీ కార్యకర్తలు. సాధారణ ప్రజలకు ఇది అంతగా నచ్చినట్టు లేదు. 

మరో అంశం హిందుత్వ కార్డు. బీజేపీ విపరీతంగా హిందూ పోలరైజేషన్ కి ప్రయత్నించింది. దీని వల్ల రెండు అంశాలు చోటు చేసుకున్నాయి. మొదగా ముస్లిం ఓటంతా మమతా వెనుక కన్సాలిడేట్ అయింది. మమతా బీజేపీకి కౌంటర్ ఇస్తూ స్టేజి మీద మంత్రాలను పఠించడం, గుళ్లకు వెళ్లడం, తాను బ్రాహ్మణా వర్గానికి చెందిన వ్యక్తిని అని చెప్పుకోవడం అన్ని వెరసి ఆమె బీజేపీకి బలమైన కౌంటర్ ఇచ్చారు. 

మమతా ఈ పరిస్థితుల నడుమ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఇప్పుడు మమతా విజయం సాధించడం జాతీయ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా పరిణమించే అవకాశం లేకపోలేదు. మోడీ వర్సెస్ మమతగా బీజేపీ ఈ ఎన్నికను మార్చింది. ఈ పరిస్థితుల్లో మోడీ, శాలను ఢీకొట్టగల ఏకైన నాయకురాలు మమతా అని ఇప్పుడు యావత్ దేశం అనుకునే స్థాయికి వెళ్లిపోయింది. ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు దేశంలో మోడీకి ఒక కరెక్ట్ ప్రత్యామ్నాయంగా కనబడుతుంది మమతనే. 

ఇప్పుడు మమత ఏమాత్రమూ బెంగాల్ లీడర్ కాదు. జాతీయ నాయకురాలు. దేశంలోని ప్రతిపక్షాలన్నిటిని ఒక్కతాటిపైకి తీసుకురాగల శక్తిని ఇప్పుడు మమతా సొంతం చేసుకున్నారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు ప్రధాన రాష్ట్రాలను ఓడిపోవడం ఇక్కడ సమస్యలను ఎత్తి చూపెడుతున్నాయి. రానున్న రోజుల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. వీటి ప్రభావం, కరోనా ను సరిగా కట్టడి చేయలేకపోవడం అక్కడ కూడా ప్రభావం చూపే ఆస్కారం లేకపోలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios