Asianet News TeluguAsianet News Telugu

కియా మోటార్స్ వివాదం: అసలు సమస్య 75 శాతం స్థానిక కోటానే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా రేజర్వేషన్ల అమలు వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకోలేకనే కీయ మోటార్స్ వెనక్కి వెళుతున్నట్టుగా వారు పేర్కొన్నారు. దీన్ని ప్రస్తుతానికి ఇటు కియా మోటార్స్, అటు ఏపీ ప్రభుత్వం రెండూ కూడా ఖండించాయి. 

Kia motors issue: 75 percent local reservation the real reason behind...?
Author
Amaravathi, First Published Feb 6, 2020, 6:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి కియా మోటార్స్ ఇష్యూ హాట్ టాపిక్ గా నడుస్తుంది. కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరలిపోతుందనే వార్త కథనాన్ని రాయిటర్స్ ప్రచురించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఆ కథనంలో వారు ప్రధానంగా చెప్పిన అంశం ఏమిటంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా రేజర్వేషన్ల అమలు వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తట్టుకోలేకనే కీయ మోటార్స్ వెనక్కి వెళుతున్నట్టుగా వారు పేర్కొన్నారు. దీన్ని ప్రస్తుతానికి ఇటు కియా మోటార్స్, అటు ఏపీ ప్రభుత్వం రెండూ కూడా ఖండించాయి. 

ఈ నేపథ్యంలో అసలు ఈ 75 శాతం రేజర్వేషన్ల అంశం ఎలా ప్రభావితం చేయబోతుందో ఒకసారి చూద్దాం. 

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందన్నా, ట్రంప్ అమెరికా  అధ్యక్షుడు అయ్యాడన్నా కారణం  ఒక్కటే స్థానికులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాము, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పడమే. ప్రభుత్వోద్యోగాల్లో రేజర్వేషన్ల గురించి మనందరికీ తెలుసు.

Also read: ఏపి నుంచి కియా మోటార్స్ ఔట్: సంచలనం సృష్టించిన వార్తాకథనం

కానీ ప్రైవేట్ సంస్థల్లో కూడా 75శాతం స్థానికులకు రిజర్వేషన్ కల్పిస్తామని జగన్ ప్రభుత్వం పాస్ చేసిన బిల్ పరిశ్రమలకు శరాఘాతంగా పరిణమించిందని ఒకింత చేర్చకైతే దారితీసింది. 

ప్రభుత్వం విషయానికి వచ్చేసరకు సంక్షేమం ముఖ్య ఉద్దేశ్యం. కానీ ప్రైవేట్ సంస్థల్లో ఆలా కాదు. అవి లాభ సముపార్జనే ధ్యేయంగా పనిచేస్తాయి. ఇలాంటి ప్రైవేట్ రంగ సంస్థల్లో పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇక్కడ నైపుణ్యానికి పెద్ద పీట వేస్తుంటారు. అలంటి సంస్థల్లో ఇది ఎలా చేయబోతున్నారు? దీని పర్యవసానాలు ఏంటి? తదితర అంశాలను ఒకసారి చూద్దాం. 

ఈ రిజర్వేషన్ ను ఎలా అమలు చేస్తారు?

ఆంధ్రప్రదేశ్ వనరులను, నిధులను కంపెనీలు వాడుకుంటున్నాయి కాబట్టి, వాటి వాళ్ళ కలిగే పర్యావరణ సమస్యలను కూడా ఎదుర్కొంటుంది ఇక్కడి ప్రజలే కాబట్టి వారికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి అనేది సహేతుక వాదనే.

అది ఇక్కడి ప్రజల హక్కు కూడా. స్థానికతకు ప్రాతిపదికగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రాలను తీసుకోనున్నారు. అంటే, ముందుగా కావాల్సిన ఉద్యోగి కోసం గ్రామస్థాయిలో అన్వేషిస్తారు, అక్కడ దొరక్కపోతే మండల స్థాయిలో, అక్కడా దొరకాపోతే జిల్లా స్థాయిలో, అక్కడా లేకపోతే రాష్ట్రస్థాయిలో వారిని స్థానికులుగా తీసుకోవచ్చు.

ఒకవేళ ఎవరూ దొరక్కపోతే, సదరు కంపెనీ మినహాయింపు కోసం, వేరే ప్రాంత వ్యక్తిని నియమించుకునేందుకు ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉంటుంది. నైపుణ్యాభివృద్ధి కోసం 3సంవత్సరాల్లోగా ప్రభుత్వం ద్వారా  శిక్షణ ఇప్పించాలి. 

ఇదంతా బాగానే ఉంది. దీనిని ఆచరణలో పెట్టే సరకు చాలానే సమస్యలు తలెత్తేలా కనపడుతున్నాయి. ఆ సమస్యలు ఏంటంటే....

ఇందాక చెప్పుకున్నట్టు రెడీగా నైపుణ్యం కలిగిన వ్యక్తులు దొరక్కపోతే కొత్తగా వచ్చే కంపెనీలు ఇబ్బంది పడక తప్పదు. అంతే కాకుండా మామూలు కింది స్థాయి ఉద్యోగాల్లో స్థానికులకు ఉద్యోగాలు దొరకడం పెద్ద విషయం కాదు. కానీ పైస్థాయి ఉద్యోగాల్లో స్థానికులు దొరక్క స్థానికేతరులను నింపితే తెలంగాణలో ఏర్పడ్డ సమస్య తిరిగి ఆంధ్రప్రదేశ్ లో ఉత్పన్నం కావచ్చు

ఇప్పటికే మహారాష్ట్రలో బిహారీలకు వ్యతిరేకంగా అక్కడ పెరుగుతున్న వ్యతిరేకత మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నలాంటి నిర్ణయాలే అన్ని రాష్ట్రాలూ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ యువత చాలా ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. 

ప్రభుత్వం నుంచి రాయితీలు పొందిన కంపెనీలు ప్రభుత్వం మాట వినొచ్చు. మరి రాయితీలు పొందని కంపెనీలు కోర్టుకు వెళ్లే ఆస్కారం కూడా ఉంది. 

మినహాయింపులను గురించి కనుక మాట్లాడితే కంపెనీలు పనిచేసే ఉద్యోగుల సంఖ్యను తక్కువగా చూపవచ్చు. ఉదాహరణకు 100 మంది పనిచేస్తుంటే వారి స్థానికత్వ రిజర్వేషన్ కు లోబడి చూపెట్టవలసిన ఏ 30 మందినో 40 మందినో మాత్రమే చూపెట్టవచ్చు, మిగిలినవారి వివరాలను దాచవచ్చు.

అంతేకాకుండా మినహాయింపు కోసం లేఖలు రాయడం, ఆఫీసుల చుట్టూ తిరగడం ఇత్యాది పనుల వల్ల అధికారుల జోక్యం అధికం అవుతుంది. అది మరోసారి ఇన్స్పెక్టర్ రాజ్, లైసెన్స్ రాజ్ విధానాలకు తెర లేపే ఛాన్స్ కూడా ఉంది. 

నైపుణ్య శిక్షణను పర్యవేక్షించడం, సర్టిఫికెట్లు ఇవ్వడం ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉండబోతున్నాయి? ఎవరికీ ఫిర్యాదు చేయాలి? తదితర అంశాల పైన ఇంకా క్లారిటీ రావలిసి ఉంది.

Also read: మనోభావాలపై క్రీడ: జగన్ నిర్ణయం బెడిసి కొడుతుందా?

ప్రత్యేక హోదా రాలేదు, వస్తాయి అనుకున్న మినహాయింపుల ఊసే లేదు. అమరావతి నిర్మాణ పనుల నుంచి ప్రపంచ బ్యాంకు తప్పుకుంది, ఏ ఐ ఐ బి , కొరియా ఎక్సిమ్ బ్యాంకులు కూడా వెళ్లిపోయాయి.

ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలు కొత్తవి రావడానికి సంశయిస్తున్నాయి. పాతవి పునరాలోచనలో పడ్డాయి. ఇలాంటి తరుణంలో ఈ చర్య మూలిగే నక్కపైన తాటికాయ అని పారిశ్రామికవేత్తలు కామెంట్ చేస్తున్నారు. 

పర్మనెంట్ ఉద్యోగాలైన ప్రభుత్వరంగంలోనే చాలా ఉద్యోగాలను కాంట్రాక్టు, అవుట్ సోర్చింగ్ ఉద్యోగులతో నింపుతుంది. అలాంటిది ప్రైవేట్ రంగంలో అదీ, పర్మనెంట్ కానీ ఉద్యోగాల్లో ఈ స్థానికత అమలు ఎలా సాధ్యపడుతుందో చూడాలి. 

స్థానికతను ప్రాతిపదికగా కనుక చేసి ఉద్యోగాలు ఇస్తే, ప్రాంతీయ వైషమ్యాలు పెరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర లేదు. ఉదాహరణకు అనంతపూర్ లోని కియా మోటార్స్ లో వేరే ప్రాంతం వాడు పనిచేయొద్దు అంటే అది ప్రాంతీయ అసమానతలు కలిగించి వైషమ్యాలకు దారి తీస్తుంది.  

ఈ స్థానికతతోటి ఎందుకొచ్చిన చిక్కులు అనుకొని కంపెనీలు ఆటోమేషన్ వైపుగా వడి వడిగా కనుక అడుగులు వేస్తే, అసలే ఉద్యోగాల లేమితో ఇబ్బంది పడుతున్న ప్రజలు మరిన్ని ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది. 

సంఘటిత రంగంలోని వారికి అమలు చేయవచ్చు. ఈ రంగం లో పనిచేసేది కేవలం 25 శాతం మంది మాత్రమే. మరి 75శాతం మంది పనిచేసే అసంఘటిత రంగాన్ని ఎలా రెగ్యులేట్ చేస్తారు? ఆ రంగంలో ఎలా ఈ చట్టాన్ని వర్తింపజేస్తారు?

మొత్తంగా కనుక తీసుకుంటే, ఈ విధానాన్ని అమలు చేసే విషయానికి వచ్చసరకు చాలానే సమస్యలు ఎదురవ్వచ్చు.

మరి దీనిని ఎలా పరిష్కరించుకోవాలి???

మొదట ఇలాంటివి అమలు చేసే ముందే ఉద్యోగార్థులకు నైపుణ్యాన్ని నేర్పించాలి. వారికి అందులో తగిన శిక్షణను ఇవ్వాలి. విద్యార్ధి దశ నుంచే వారికి పరిశ్రమల్లో ఖచ్చితంగా అప్రెంటిస్ షిప్, ఇంటర్న్ షిప్ లాంటివి అందించాలి.

ఇందుకోసం ఒక చట్టాన్ని చేసినా కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. నైపుణ్యం ఉన్న అభ్యర్థులు అక్కడే దొరికినప్పుడు ఏ కంపెనీ మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టి బయట నుండి ఉద్యోగులను తెచ్చుకుంటుంది చెప్పండి?

Follow Us:
Download App:
  • android
  • ios