ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కనీ విని ఎరుగని రీతిలో ఈ సారి హాట్ హాట్ గా సాగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీజేపీలు మూడు ప్రధాన పార్టీలుగా కనబడుతున్నప్పటికీ వాస్తవానికి ఢిల్లీలో బీజేపీ వర్సెస్ ఆప్ గా మాత్రమే సాగుతుంది. 

ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక అంశాలను ప్రధాన అజెండాగా చేసుకొని ఎన్నికలకు వెళుతుండగా, జాతీయత, జాతీయ అంశాలను ప్రధాన అజెండాగా చేసుకొని బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండో పర్యాయం ఢిల్లీ ముఖ్యమంత్రిగా, టెక్నికల్ గా మాట్లాడితే మూడవ పర్యాయం పోటీ పడుతున్నాడు. ఎలాగైనాసరే కేజ్రీవాల్ ని గద్దె దించాలని కృత నిశ్చయంతో తీవ్రంగా శ్రమించింది. 

ఉదయాన్నే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరినీ వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా యువతను వచ్చి ఓటు వేయమని పిలుపునిచ్చారు. ఆ తరువాత ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రస్తుత  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక ట్వీట్ చేసారు. 

ప్రధాని నరేంద్ర మోడీ యువతను ఓటు వేయమని పిలుపునిస్తే.... అరవింద్ కేజ్రీవాల్ ఏమో మహిళలను బయటకు వచ్చి ఓటు వేయమని పిలుపునిచ్చారు. ఆయన ట్విట్టెర్లోనే కాకుండా, ఓటు వేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ కూడా మహిళలను బయటకు రమ్మని పిలుపునిచ్చారు. 

కేజ్రీవాల్ మాట్లాడుతూ... మహిళలను ఓటు వేయమని కోరుతూనే, తమ ఇండ్లలోని మగవారిని కూడా తమవెంట తీసుకువచ్చి ఓటు వేయించాలని కోరారు. మొగవారికి అర్ధమయ్యే విధంగా అభివృద్ధి కోసం ఓటు వేయమని వారికి వాస్తవాన్ని వివరించాలని కోరారు. 

Also read: ఢిల్లీ ఓటర్లకు బంపర్ ఆఫర్.. బస్సు, విమానం అన్నీ ఫ్రీగానే..

ఇలా ఇద్దరు ముఖ్యనేతలు ఓటు వేయమని పిలుపునిస్తూనే... ఒక ప్రత్యేక వర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా పిలుపునివ్వడం ఇక్కడ ఆసక్తికర అంశం ఈ నేపథ్యంలో అందరూ కూడా ఎందుకు ఇలా ఇద్దరు నేతలు ఇలా వేర్వేరు వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి చూస్తున్నారో మామూలు వారికి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. 

వాస్తవానికి మహిళలు అధికంగా ఓటు వేసిన స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయాలను నమోదు చేసింది. మహిళలే టార్గెట్ గా కేజ్రీవాల్ అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెట్టాడు. బస్సుల్లో ఉచిత ప్రయాణాల నుంచి మొదలుకొని ఉచిత కరెంటు, నీళ్ల వరకు అనేక వాటిని అందించాడు. 

కాబట్టి మహిళా ఓట్ల శాతం గనుక అధికంగా నమోదయితే.... అరవింద్ కేజ్రీవాల్ కు లాభం చేకూరుతుంది. ఈ కారణం వల్లనే కేజ్రీవాల్ మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ వారికి పిలుపునిచ్చారు. 

ఇక నరేంద్ర మోడీ విషయానికి వచ్చేసరికి.... బీజేపీ వారు ప్రధానంగా జాతీయ అంశాల మీద ఎన్నికలకి వెళ్లారు. వారు నేను దేశం కోసం ఓటు వేస్తాను, అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 

ఎన్నార్సి, ఎన్పిఆర్, తదితర అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టి వారు ఎన్నికల బరిలో నిలిచారు. ఇలా ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో... బీజేపీకి సపోర్ట్ బేస్ గా ఉన్న యువత ఈ విషయాలపట్ల బాగా ఆకర్షితులవుతారు. 

అందుకోసమని జాతీయత అంశాలపట్ల బాగా మక్కువ చూపెట్టే యువతను తరలి వచ్చి ఓటు వేయమని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇది ఈ రెండు పార్టీల స్ట్రాటెజిల వెనకున్న వ్యూహం.