Asianet News TeluguAsianet News Telugu

''34 ఏళ్ల ఆంక్షలకు తెరదించుతూ శ్రీనగర్ లో మొహర్రం ఊరేగింపులు..''

Srinagar: మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ జ్ఞాపకార్థం శ్రీనగర్ లో మొహర్రం ఊరేగింపులో పాల్గొనాలని అప్పటి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన శాంతి ప్రకటన విఫలం కావడంతో పాటు షియాల సంప్రదాయ సంతాప కార్యక్రమంపై ఆంక్షలు విధించిన సరిగ్గా 35 ఏళ్ల తర్వాత, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం శ్రీనగర్ లో జరిగిన అషూరా ఊరేగింపులో పాల్గొన్నారు. 
 

Jammu and Kashmir: Farooq Abdullah's bravado led to 34-year restriction on Muharram processions in Srinagar RMA
Author
First Published Jul 31, 2023, 12:02 PM IST

Muharram Procession: మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ జ్ఞాపకార్థం శ్రీనగర్ లో మొహర్రం ఊరేగింపులో పాల్గొనాలని అప్పటి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన శాంతి ప్రకటన విఫలం కావడంతో పాటు షియాల సంప్రదాయ సంతాప కార్యక్రమంపై ఆంక్షలు విధించిన సరిగ్గా 34 ఏళ్ల తర్వాత, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం శ్రీనగర్ లో జరిగిన అషూరా ఊరేగింపులో పాల్గొన్నారు. లోయ‌లో మారిన శాంతియుత వాతావ‌ర‌ణానికి నిద‌ర్శ‌నంగా ఈ ర్యాలీ నిలుస్తోంది. మొహర్రం 8వ రోజున ఊరేగింపు ప్రశాంతంగా మరో సంప్రదాయ మార్గంలో గురు బజార్ నుండి దాల్గేట్ వరకు నగర కేంద్రంలోని ఎంఏ రోడ్డు గుండా ప్రశాంతంగా సాగిన రెండు రోజుల తరువాత, నగర శివార్లలోని బోటా కడల్ నుండి జదీబాల్ వరకు జుల్జినా ఊరేగింపును మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు.

1988 ఆగస్టులో, కాశ్మీర్ లో పాకిస్తాన్-మద్దతు సాయుధ తిరుగుబాటు తలెత్తడానికి దాదాపు ఒక సంవత్సరం ముందు, ఫరూక్ అబ్దుల్లా - సున్నీ ముస్లిం- కాశ్మీర్ ముస్లిం జనాభాలో 25 శాతం ఉన్న షియాలకు తన మద్దతును చూపించడానికి అషూరాకు నాయకత్వం వహించడానికి ముందుకొచ్చారు. సాధారణ ఘర్షణలు, ఉద్రిక్తతలను నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గం కోసం పరిపాలన, ముస్లిం నాయకుల సూచనలను అబ్దుల్లా తోసిపుచ్చారు. ఆ రోజుల్లో తిరుగుబాటు తలెత్తకపోయినప్పటికీ, విమాన ప్రమాదంలో పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ జియా-ఉల్-హక్ మరణించిన సంబంధం లేని సంఘటన హింసను ప్రేరేపించడంతో క్షేత్రస్థాయి పరిస్థితి బలహీనంగా మారింది. 1988లో సున్నీ, షియా వర్గాల నాయకులు మొహర్రం హింస, సామాజిక ఉద్రిక్తతలు లేకుండా జరిగేలా చూడాలని నిర్ణయించారు. ప్రముఖ షియా నాయకుడు మౌల్వీ ఇఫ్తికార్ అన్సారీ, కొందరు సున్నీ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మూసా రజాను కలిశారు. దీని గురించి మూసా రజా త‌న ర‌చ‌న‌ ''Kashmir: land of regrets'' రాశారు. దుర్బల ప్రాంతాల గుండా ఊరేగింపు వెళ్లకుండా ఉండేందుకు నాయకులు కొత్త మార్గాన్ని సూచించారు. అయితే ఈ ఆలోచనను తోసిపుచ్చిన అబ్దుల్లా షియా ప్రజలను ఎందుకు రాజీ పడేలా చేయాలని ప్రశ్నించారు.

Jammu and Kashmir: Farooq Abdullah's bravado led to 34-year restriction on Muharram processions in Srinagar RMA

అషూరా ఊరేగింపుకు నాయకత్వం వహిస్తానని కూడా ఆయన ముందుకొచ్చారు. ఫరూక్ అబ్దుల్లా ఊరేగింపులో పాల్గొని రాళ్లు రువ్వాలని ప‌రిస్థితుల‌కు కార‌ణం అయ్యారు. సీఎం ఈ పరిస్థితి నుండి ఎలాగోలా రక్షించబడ్డారు, కాని ఈ సంఘటన శ్రీనగర్ లో మొహర్రం ఊరేగింపుపై 1989 లో నిషేధానికి దారితీసింది. మూడు దశాబ్దాల ఉగ్రవాదం అంతటా కొనసాగింది. రాచరికం రోజులలో, "షియా-సున్నీ ఉద్రిక్తతలను" నివారించడానికి ఆషూరా ఊరేగింపును రాత్రి సమయంలో మాత్రమే అనుమతించారని చెబుతారు. సాంప్రదాయకంగా మొహర్రం ఊరేగింపులు నామ్చిబాల్ నుండి శ్రీనగర్ లోని జదీబాల్ వరకు నిర్వహించబడ్డాయి.. సీఎం షేక్ మొహమ్మద్ అబ్దుల్లా అబీ గుజార్ (మధ్య లాల్ చౌక్ ప్రాంతంలో) నుండి పాతబస్తీ మీదుగా జదీబాల్ వరకు మార్గాన్ని ప్రతిపాదించారు. 34 ఏళ్ల తర్వాత 8వ మొహర్రం ఊరేగింపు గురు బజార్ నుంచి దాల్గేట్ వరకు సంప్రదాయ మార్గంలో జరుగుతున్నందున కాశ్మీర్ లోయలోని షియా సోదరులకు ఇది చారిత్రాత్మక సందర్భమని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన తాజా సందేశంలో పేర్కొన్నారు. ''34 ఏళ్లుగా మొహర్రం ఊరేగింపును సంప్రదాయ మార్గంలోనే నిషేధించారు. షియా సోదరుల మనోభావాలను మేము గౌరవిస్తాము. పరిపాలన ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని నేను సమాజానికి హామీ ఇస్తున్నాను. జ‌మ్మూకాశ్మీర్ యూటీలో మార్పుకు, సాధారణ పరిస్థితులకు ఇదే నిదర్శనం'' అని లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొన్నారు.

సంప్రదాయ మార్గంలో మొహర్రం ఊరేగింపుకు అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. జామియా మసీదులో శుక్రవారం ప్రార్థనలకు అనుమతించాలనీ, హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని కోరారు. 8వ మొహర్రం ఊరేగింపునకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఇది ఏకపక్ష నిర్ణయం కాకూడదని అన్నారు. ''శ్రీనగర్ లోని జామియా మసీదులో శుక్రవారం ప్రార్థనలకు నేతృత్వం వహించడం ద్వారా తన మతపరమైన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కాశ్మీర్ లోని ప్రముఖ మత గురువు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ సంవత్సరాల తరబడి ఉన్న నిర్బంధం కూడా ఇప్పుడు ముగుస్తుందని మేము ఇప్పుడు ఆశిస్తున్నాము. ఈద్గాలో ఈద్ ప్రార్థనలను అనుమతించడం, మజార్-ఎ-షుహాదాలో స్మారక కార్యక్రమాలను నిర్వహించడం కూడా ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఎంతగానో దోహదపడుతుందని'' ఒమర్ అన్నారు.

- ఎహ్సాన్ ఫాజిలీ

(ఆవాజ్ ది వాయిస్ సౌజ‌న్యంతో..)

Follow Us:
Download App:
  • android
  • ios