అమరావతి: అసెంబ్లీ సమావేశాల చివరి రోజు జగన్ ఎప్పుడైతే మూడు రాజధానులు వచ్చే ఛాన్స్ ఉందని అన్నాడో...అది మొదలు ఆంధ్రప్రదేశ్ రాజకీయమంతా రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. అమరావతిప్రాంత ప్రజలు రోడ్డెక్కి నిరసనాలు తెలుపబట్టి నేటికీ 10 రోజులయ్యింది. 

నేటి ఆంధ్రప్రదేశ్ కాబినెట్ భేటీ ముగిసిన తరువాత మంత్రి పేర్ని నాని కేబినెట్ భేటీ అంశాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రాజధాని విషయమై ఇంకా సమయం ఉందని అన్నాడు. దానిపైన అంత తొందరేంలేదని అన్నాడు. జిఎన్ రావు కమిటీ రిపోర్టు వచ్చిందని, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్టు రావలిసుందని అన్నాడు. 

Also read: AP capital: ఏపీకి 3 రాజధానులు: జగన్ నిర్ణయం వెనకున్నది ఈయనేనా?

సో మొత్తానికి ఇంకో కొన్నిరోజులవరకైనా రాజధాని మార్పు ప్రకటన ఉండదు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. నిన్న విజయసాయి రెడ్డి అంత బలమైన ప్రకటన చేసిన తరువాత కూడా జగన్ ఇలా కమిటీ రిపోర్టు వచ్చేవరకు ఆగి, దాన్ని పరిశీలించడానికి మరో హై పవర్ కమిటీ వేయడం ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రజల కోరికను జగన్ ఒకింత ఆలోచించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటేనే ఇచ్చిపుచ్చుకోవడం. 

మొత్తానికి ఇంకొన్ని రోజులు మాత్రం రాజధానికి సంబంధించిన ప్రకటన రాకపోవచ్చు అనేది స్పష్టమవుతుంది. ప్రాథమికంగా చూస్తే మనకు రెండు కారణాలు కనబడుతున్నాయి. మొదటిది ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణ. 

అధికార వైసీపీ టీడీపీ శ్రేణులు వారికి సంబంధించిన వారు భారీ స్థాయిలో భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆర్ధిక మంత్రి బుగ్గన గారు అసెంబ్లీ సాక్షిగా లెక్కలతోసహా చిట్టా చదివారు. కానీ ఆ చిట్టాపైన ఎటువంటి చర్యలను వైసీపీ తీసుకోలేకపోయింది.

దీన్నే అదునుగా చూసుకొని టీడీపీ నేతలు వైసీపీ చేసిన ఆరోపణలు తప్పు కాబట్టే తమను జైళ్లలో పెట్టలేకపోతున్నారని, ఒకవేళ గనుక తమ పార్టీ నేతలు తప్పు చేసి ఉంటే, తమ మీద కేసులు పెట్టకుండా ఈ అసత్య ఆరోపణలు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఈ విషయం నిగ్గుతేల్చకుండా ముందుకు వెళితే ఒకింత నష్టం జరగొచ్చని గ్రహించే ముందు ఈ అమరావతిపై ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతుంది. 

ఇక రైతులు కూడా ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడిగారు. కొందరు టీడీపీ నాయకులు చేసిన తప్పులకు తమను ఎందుకు శిక్షిస్తున్నారని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే పాయింట్ ను ముందుకు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దీనికి ముందుగా అమరావతి నిర్మాణం రేటును స్క్రీన్ మీదకు తీసుకురావడం. జగన్ ఇప్పుడు అదే సూత్రాన్ని ముందుకు పెడుతున్నారు.  

Also read; అమరావతికి వైఎస్ జగన్ టోకరా: అసలు వాస్తవం ఇదీ...

సిబిఐ విచారణలో నిజాలు తేలడానికి సమయం పట్టినా ముందు ఈ సిబిఐ విచారణ ప్రారంభమైతే తొలుత టీడీపీ మైలేజ్ రాజకీయంగా తగ్గుతుందని వైసీపీ భావిస్తోంది. కాబట్టి తొలుత ఈ విషయం మీద పడింది వైసీపీ. 

ఇక వైసీపీ ఆలోచించిన మరో అంశం స్థానిక సంస్థల ఎన్నికలు. వైసీపీ పార్టీ 150 పైచిలుకు స్థానాలు గెల్చినప్పటికీ కూడా ఆ స్థానాలన్నీ జగన్ తన సొంత బలం మీద గెల్చినవే. ప్రజలు జగన్ ని చూసి నమ్మి ఓట్లు వేశారు తప్ప మరోలా కాదు. మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో క్యాడర్ బలంగా ఉన్న పార్టీ విజయాన్ని సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎన్నికల ముందు తాము రాజధాని మార్పుపై తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనా అది జగన్ కు మేలు కలిగిస్తుందని జగన్ భావించి ఉండవచ్చు. 

అంతే కాకుండా ఒక వేళా ఇప్పుడు చంద్ర బాబు గనుక రాయలసీమకు హై కోర్ట్ ఒక్కటే ఎలా న్యాయం చేస్తుందనే ప్రశ్నను లేవనెత్తుతూ గనుక సీమలో తిరిగితే జగన్ కు ఒకింత ఇబ్బందులు తప్పకపోవచ్చు. 

ఇక మరో అంశం ఏమిటంటే... టీడీపీ చేస్తున్న ప్రధాన విమర్శ విశాఖపట్నంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే టీడీపీ వాదన. ఇప్పుడు గనుక ఇంత అర్జెంటుగా గనుక మారుస్తే ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్టయితుంది. 

కానీ మొత్తానికి ఈ కాబినెట్ భేటీ తరువాత వచ్చిన అవుట్ కమ్ ఒక్కటే.... అమరావతి విషయంలో అన్ని కోణాలు పక్కకు పోయి నేరుగా అమరావతి రాజధాని నిర్మాణం సాధ్యమవ్వదు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం దీన్ని పూర్తి చేయలేదు అనే విషయం బయటకు తీసుకువచ్చింది, మున్ముందు బలంగా ఇదే వాదనను ఎత్తుకోబోతుంది.