తెలంగాణలో కరోనా కట్టడి: కేసీఆర్ అసహనం, పోలీసుల ఓవర్ యాక్షన్
నిన్న కేసీఆర్ తెలంగాణాలో లాక్ డౌన్ అమలవుతున్న తీరు గురించి అసహనం వ్యక్తం చేసారు. మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలనీ ఆదేశాలను జారీచేశారు. దీనితో పోలీసులు అత్యుఉత్సాహం ప్రదర్శిస్తూ ప్రభుత్వం జీవోలో అనుమతిచ్చిన కార్యక్రమాలకు కూడా అడ్డుపడుతున్నారు.
తెలంగాణలో లాక్ డౌన్ ని గత కొన్ని రోజులుగా అమలు చేస్తున్నప్పటికీ... కేసులు మాత్రం తగ్గడం లేదు. అధికారిక లెక్కలు అదే 3,500 నుండి 4,000 మధ్య కేసులను చూబెడుతున్నప్పటికీ... వాస్తవిక పరిస్థితులు ఏమిటనేది అందరికి తెలుసు. మన చుట్టుపక్కల ఎంతమంది రోజు వారీగా కరోనా బారిన పడుతున్నారు అని నోటి లెక్కలు కట్టినా అవి ప్రభుత్వ లెక్కల కన్నా ఎక్కువగానే తేలుతాయి.
కేసుల నిజనిర్ధారణను కొద్దీ సేపు పక్కనుంచితే నిన్న కేసీఆర్ తెలంగాణాలో లాక్ డౌన్ అమలవుతున్న తీరు గురించి అసహనం వ్యక్తం చేసారు. మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలనీ ఆదేశాలను జారీచేశారు. దీనితో పోలీసులు అత్యుఉత్సాహం ప్రదర్శిస్తూ ప్రభుత్వం జీవోలో అనుమతిచ్చిన కార్యక్రమాలకు కూడా అడ్డుపడుతున్నారు.
నేటి ఉదయం నుండి స్విగ్గి, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ బాయ్స్ ని ఎక్కడబడితే అక్కడ ఆపుతున్నారు. వారి వాహనాలను సీజ్ చేసి చలాన్లు విధించారు పోలీసులు. నల్గొండలో ఏకంగా విద్యుత్ ఉద్యోగుల మీద లాఠీలను ఝులిపించారు. వారు ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకు వచ్చే ప్రభుత్ఉద్యోగులే కదా..? పోలీసుల ఈ స్థాయి ఓవర్ యాక్షన్ అనేక ఇబ్బందులకు కారణమవుతుంది.
హైదరాబాద్ లో ఎందరో మంది వాలంటీర్స్ ప్రభుత్వం చేయలేకపోతున్న పనులను చేస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణాలో కూడా బెడ్లు దొరకని పరిస్థితి. ఇప్పటికి కూడా కొన్ని మందుల కోసం, ఆక్సిజన్ కోసం ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ని అడుక్కోవాల్సిన పరిస్థితి. ఆసుపత్రుల్లో రెడీగా అందుబాటులో ఉండాల్సిన వస్తువులు లేవు. అలంటి పరిస్థితుల్లో ఎందరో వాలంటీర్స్ హైదరాబాద్ లో ఎందరో ప్రాణాలను కాపాడారు. ఆసుపత్రి బెడ్ల నుండి మందుల వరకు అన్నిటిని ఏర్పాటు చేసారు.
నేడు పోలీసులు అలంటి వారిని ఆపి ఫైన్స్ విధించారు. ముషీరాబాద్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ని రోగికి అందించడానికి వెళ్తున్న భరత్ అనే వాలంటీర్ ని ఆపి ఫైన్ వేశారు. అతను ఎంత చెప్పినా కూడా పోలీసులు వినలేదు. ఇక నేటి పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల ఎందరో కరోనా రోగులకు సమయానికి అందే ఫుడ్ అందలేదు. చాలా మంది వాలంటీర్స్ ఉచితంగా క్వారంటైన్ లో ఉన్న రోగులకు ఫుడ్ ని అందిస్తున్నారు. కానీ నేడు అలా ఫుడ్ అందించే ఎందరో వాలంటీర్స్ ని రోడ్డుపై పోలీసులు ఆపడంతో వీరు వచ్చి ఫుడ్ డెలివరీ చేస్తారులే అనే నమ్మకం పెట్టుకున్న కరోనా రోగులకు ఆకలే మిగిలింది.
నేటి పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల ఆసుపత్రుల్లో రక్తం కోసం ఎదురు చూస్తున్న పేషెంట్స్ ఇబ్బంది పడ్డారు. నిత్యం తలస్సేమియా, ఇతర పేషెంట్స్ కి రక్తం అవసరం ఉంటుంది. అలా రక్తం ఇవ్వడానికి బయల్దేరిన వాలంటీర్స్ ని కూడా పోలీసులు ఆపి ఫైన్స్ విధించారు. ఈ పాస్ లో కనీసం బ్లడ్ డొనేషన్ ఆప్షన్ ని కూడా ఇవ్వలేదు పోలీసులు. కఠినంగా అమలు చేయమంటే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కోరానని తరిమికొట్టడం కానీ... ఇలా ఫైన్లు వేసు లాఠీలు ఝుళిపించి ప్రజలను కొట్టడం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు నిద్రలేచి ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి.