చివరిసారిగా పారికర్ ని అప్పుడు కలిశా, సైనికుల తరపున సెల్యూట్ చేశా
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూసారు అన్న వార్త వినగానే చాలా బాధేసింది.
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూసారు అన్న వార్త వినగానే చాలా బాధేసింది. ఎంతో వేదనకు గురిచేసింది. ఇది జరుగుతుంది అని ముందే తెలిసినప్పటికీ ఆయన మరణం చాలా బాధించింది. కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. కానీ ఆయన దానిని లెక్కచేయకుండా తన విధులు నిర్వర్తించారు.
సరిగ్గా కొన్ని వారాల ముందు ఫిబ్రవరిలో మనోహర్ పారికర్ ని చివరిసారిగా కలిశాను. ఆనాటి జ్ఞాపకాలు నేను బ్రతికున్నంత వరకు నాతోనే ఉంటాయి. నాకు మనోహర్ పారికర్ 2002 నుంచి తెలుసు. నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుటుందని ప్రతిపాదించిన తొలి వ్యక్తి మనోహర్ పారికర్. మొదటి సారి మనోహర్ పారికర్ తో భేటీ నాకు ఇప్పటికీ బాగా గుర్తింది.
ఆయనతో తొలి సమావేశం ఢిల్లీలో జరిగింది. ఆయనతో సమావేశం నాపై బలమైన ముద్ర వేసింది. పొగరు, అహంకారం లాంటివి లేని రాజకీయనాయుకుడు అనగానే నాకు మొదటగా గుర్తుకు వచ్చేది ఆయనే. పారికర్ చాలా తెలివికలవాడు. ఆయన పదునైన బుద్ధి కుశలత, స్పష్టత అమోఘమైనవి.
నేను తొలిసారి 2006లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాను.ఆ సమయంలో.. ఒక మాజీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కొడుకుగా.. సాయుధబలగాల కుటుంబసభ్యులు, వారి సంక్షేమంపై ఎక్కువ దృష్టిపెట్టాను. నేను ఎంచుకున్న, అనుసరించిన సమస్యలు వన్ ర్యాంక్ వన్ పెన్షన్, నేషనల్ వార్ మెమోరియల్, మాజీ అధికారులు, వితంతువులు, వికలాంగులైన సైనికులకు సంబంధించినవి. కానీ ఈ సమస్యలకు యూపీఏ ప్రభుత్వ హయాంలో పరిష్కారం దొరకలేదు.
కానీ ఎప్పుడైతే మనోహర్ పారికర్ రక్షణ శాఖ మంత్రి అయ్యారో.. రక్షణ శాఖకు కొత్త శ్వాస ఊదారు. సాయుధబలగాలు, వారి కుటుంబాలు, వారి సంక్షేమం గురించి తెలుసుకొని ఆయన ఆందోళన చెందారు. ఈ విషయంపై ఆయనను నేను వెంటనే ఒప్పించాను అనే కంటే.. అసలు ఒప్పించాల్సిన అసవరం కూడా రాలేదు అని చెప్పడం సమంజశంగా ఉంటుంది.
ఆయన వెంటనే.. మాజీ ఉద్యోగులు, వారి కుటుంబాలతో నేరుగా సమావేశమయ్యారు. స్వయంగా ఆయనే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అధికారులను వెంట పెట్టుకోకుండా.. ఆయనే స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి సమస్యలను విన్న వెంటనే ఆయన నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. దాని ద్వారా సమస్యలను పరిష్కరించే ఏర్పాటు చేశారు.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం మాజీ సాయుదబలగాల ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు. నేను కూడా 2006లో ఎంపీ అయినప్పటి నుంచి పోరాడుతున్నాను. సాయుధ దళాలలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఇది భావోద్వేగ సమస్య. దాదాపు 42 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సమస్య అది. మోదీ ప్రధానిగా, పారికర్ రక్షణ మంత్రిగా అవ్వడానికి ముందు 8 సంత్సరాలుగా చాలా మంది సాయిదళాలలో పనిచేసిన వారు పతకాలను తీసుకోవడాన్ని కూడా నిరాకరించారు.
కానీ... ఈ సమస్యకు మనోహర్ పారికర్ కేవలం కొన్ని గంటల్లోనే పరిష్కారం చూపించారు. ప్రధాని నరేంద్రమోదీ మద్దతుతో సాయుధబలగాల సమస్యకు ఓ పరిష్కారం చూపించారు. వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ కోసం బీజేపీ ప్రభుత్వం రూ.35వేల కోట్లును విడుదల చేసింది.
మరో సందర్భంలో.. మనోహర్ పారికర్ నిబద్ధత, పనితీరును చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను ఒక జాతీయ సాయుదబలగాల ఒప్పంద బిల్లును ప్రైవేటు మెంబర్స్ బిల్లుగా ప్రవేశపెట్టాను. యుద్ధంలో చనిపోయిన వారి కుటుంబాలు, మాజీ ఉద్యోగులను జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రభుత్వం ఒక చట్టపరమైన బాధ్యత కలిగి ఉండాలి అనేది ఆ బిల్లు సారాంశం.
సాధారణంగా ప్రైవేటు మెంబర్స్ బిల్లును జూనియర్ మంత్రులు పార్లమెంట్ లో ప్రవేశపెడితే.. దానిపై చర్చ జరుగుతుంది. అయితే.. నా విషయంలో మాత్రం మూడు సార్లు... నేను పెట్టిన బిల్లును స్వయంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టి..బిల్లుకు తాను అంగీకారం తెలుపుతున్నట్లు స్వయంగా ఆయనే చెప్పారు.
గత కొంతకాలం క్రితం ఆయన అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు నేను విన్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని కూడా కోరుకున్నాను. ఫిబ్రవరిలో చివరిసారిగా ఆయనను కలవడానికి వెళ్లాను. ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అమలులోకి వస్తున్నాయన్న విషయాన్ని ఆయనకు చెప్పడానికి వెళ్లాను.
సాయుధబలగాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన మాజీ ఉద్యోగులు, యుద్ధంలో గాయాలపాలై వికలాంగులుగా మారిన వారి సమస్యల పరిష్కారం కోసం పారికర్ ఏర్పాటు చేసిన సిఫార్స్ కమిటీ అమలులోకి వచ్చిందన్న విషయాన్ని ఆయనతో నేను చెప్పాను. భారతదేశం 70 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నేషనల్ వార్ మోమోరియల్ ప్రారంభం జరిగినట్లు కూడా చెప్పాను.
నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఆయన విన్నారు. ఆయన కూడా నాతో కొన్ని మాటలు మాట్లాడారు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. మునుపటిలాగానే ఎంతో దృఢంగా ఉన్నారని నాకు అనిపించింది. సాయుధబలగాల మాజీలు, వారి కుటుంబసభ్యులందరి తరపున చివరగా.. ఆయనకు నేను సెల్యూట్ చేశాను. కొద్దికాంలోనే ఆయన గురించి చాలా తెలుసుకున్నాను. ఆయనను అభిమానించడం ప్రారంభించాను. ఆయన జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు నాకు ఎంతో విలువైనవి.
రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ.