మహారాష్ట్ర ఫలితం నేపథ్యంలో, ఈ రాష్ట్రానికి అనుకోని ఉండే కర్ణాటక ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. డిసెంబర్ 5వ తేదీన అక్కడ ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రతోని ఆనుకొని ఉండే ఉత్తర కర్ణాటక ప్రాంతాలు చాలా ఇప్పుడు ఉప ఎన్నికకు పోనున్నాయి. వీటిలో గోకక్ ,అథని, విజయపుర ఇత్యాది స్థానాలన్నీ మహారాష్ట్రను అనుకోని ఉంటాయి. 

ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని బీజేపీ వర్గాల్లో కలవరం మొదలయ్యింది. మహారాష్ట్రలో ఇతర పార్టీలనుంచి బీజేపీలోకి ఫిరాయించి పోటీ చేసిన అగ్రభాగం ఎమ్మెల్యేలు ఓటమి చెందిన విషయం తెలిసిందే. 

Also read: కర్ణాటక గౌడలకు మహారాష్ట్ర పవార్ లకు చాలా దగ్గరి పోలిక

అంతే కాకుండా మహారాష్ట్రను ఆనుకొని ఉండే ప్రాంతాలతో మహారాష్ట్ర నేతలకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అంతే కాకుండా ఈ ప్రాంతంలో చెక్కర అధికంగా పండడం, బరిలో ఉన్న సభ్యులంతా చెక్కర పరిశ్రమ కింగులే అవడం ఇక్కడ మరొక ఆసక్తికర అంశం. 

వీటికి తోడు, సహకార సంఘాలకు నాయకత్వం వహించని ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉండరంటే అతిశయోక్తి  కాదు. ఇప్పుడు పొరుగునున్న మహారాష్ట్రలో ఇలా జరిగింది అనే మెసేజ్ గనుక వెళితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని భావించిన యెడ్యూరప్ప సర్కార్, ఎలాగైనా తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. 

ఇందుకు తగ్గట్టుగానే కర్ణాటక రాష్ట్రంలోని బీజేపీ సర్కార్‌ను కాపాడుకునే దిశగా ఎత్తుగడలు ముమ్మరం చేస్తున్న ట్టు తెలుస్తోంది. మరోసారి ఆపరేషన్‌ కమలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దక్షిణాదిన బీజేపీకి బలం, ప్రభుత్వం ఉండేది కేవలం కర్ణాటకలో మాత్రమే. 

రాష్ట్రంలో బీజేపీ సర్కార్‌ సురక్షితంగా కొనసాగాలంటే కనీసం మరో 6గురు ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న 15 నియోజకవర్గాలలో తప్పనిసరిగా 6చోట్ల గెలవాల్సి ఉంది. లేదంటే యడియూరప్పకు తిప్పలు తప్పవు. 

Also read: గోవా రాజకీయాల్లో సంజయ్ రౌత్ వేలు... అక్కడ బీజేపీ అధికారం కోల్పోతుందని జోశ్యం

14 నెలలపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ సర్కారు కూలిపోగానే, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీలలో నెలకొన్న విబేధాలు దీనికన్నా ముఖ్యంగా రాజీనామాలతో సర్కారు కూలిన విషయం తెలిసిందే. 

ఉప ఎన్నికలు సమీపిస్తు న్న సమయంలో మాజీ ప్రధాని దేవేగౌడ ఒక బాంబు పేల్చారు. డిసెంబరు రెండోవారంలో రాష్ట్రంలో భారీ మా ర్పులు చోటు చేసుకుంటాయని ప్రభుత్వం కూ లిపోనుందని జోశ్యం చెప్పారు. .

ఆయన మాటల్లో భారీ మార్పులంటే కాంగ్రె్‌సతో జేడీఎస్‌ చేతులు కలపడం మినహా మరో ప్రత్యామ్నాయమైతే కనపడడం లేదు.  కాబట్టి, దేవేగౌడరాష్ట్ర కోబ్గ్రెస్ నేతలతో సంబంధం లేకుండా ఢిల్లీ నుండి నరుక్కొచ్చే ఆలోచనలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అంతే కాకుండా తన కొడుకు ముఖ్యమంత్రి పదవిపైనే కూడా కామెంట్స్ చేసాడు. 

దీనికితోడు బీజేపీకి మహారాష్ట్రలో ఎదురుదెబ్బ తగలడంతో వారు ఒకింత ఆలోచనల్లో పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకలో సర్కార్‌ కొనసాగాల్సిందేనని రాష్ట్ర నేతలకు సందేశమిచ్చినట్టు తెలుస్తోంది.

 ఇదే విషయమై సీఎం యడియూరప్ప మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగించేందుకు ఎవరి సహకారం అవసరం లేదని అన్నారు. ఉప ఎన్నికలలో 15 చోట్ల ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

శివసేన సైతం ఇప్పటికే గోవాలో వేలు పెట్టె పనిలో బిజీగా ఉన్నట్టు నిన్నటి సంజయ్ రౌత్ ప్రెస్ మీట్ ద్వారా అర్థమయిపోయింది. కాబట్టి కర్ణాటకలో ఖచ్చితంగా ఏదో పెను మార్పు జరిగేదిలా కనపడుతుంది.

ఇక్కడ కాకపోతే బీజేపీకి కలిసొచ్చే మరో అంశం ఏమిటంటే, కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ ఉన్నంత కాలం ఇరు పార్టీ నేతల మధ్య సమానవ్యలోపం కొట్టొచినట్టే కనపడేది. వీరి గొడవల వల్ల పాలన అటక్కెక్కిందనేది మాత్రం వాస్తవం. 

Also read : తెరపైకి శివాజీ.. హిందుత్వ స్థానేనా లౌకికత్వం..ఆసక్తికరంగా మహా రాజకీయం

అంతే కాకుండా ఈ సీట్లలో కొన్ని ఉత్తరకన్నడ జిల్లాలోనూ, బెంగళూరు నగరంలోనూ ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ బీజేపీకి పెట్టని కోటలు. అంతే కాకపోతే ఇక్కడే మరో కీలక విషయం ఏమిటంటే, ఈ సీట్లను కాంగ్రెస్ లేదా జేడీఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. 

ఇక్కడ ఇంకో సమస్య ఏమిటంటే, ఈ ప్రస్తుతం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీకి చెందిన వారు. వారు వెళ్లి బీజేపీలో చేరినప్పుడు అక్కడ గత దఫాలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందినవారు ఎంత మేర ఈ అభ్యర్థులకు సహకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వీరిలో కొందరు బాహాటంగానే నిరసన స్వరం వినిపిస్తుండగా, కొందరేమో అంతర్గతంగా వీరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. 

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక ఉప ఎన్నికకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, జేడీఎస్ లు తమ శాయశక్తులను ఒడ్డుతూ, శత్రువు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.