Asianet News TeluguAsianet News Telugu

ఉద్యమాలు తప్ప కుట్రలు తెలియని గద్దర్ కూతురు వెన్నెల కాంగ్రెస్ ట్రాప్ లో పడిందా ...?

కాంగ్రెస్ పార్టీ కి గద్దర్ కుటుంబం పట్ల చిత్తశుద్ది ఉంటే గద్దర్ ప్రాబల్యం ఉన్న రూరల్ నియోజికవర్గాలలో స్థానం కల్పించవచ్చు. మిలటరీ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు, ఆరవ మాల ఎక్కువగా ఉండే కంటోన్మెంట్ ఏరియాలో గద్దర్ లెగసీని గుర్తించేది ఎవరు ?

Gaddars daughter Vennela fallen into the trap of the Congress? opinion - bsb
Author
First Published Oct 26, 2023, 11:28 AM IST | Last Updated Oct 26, 2023, 11:28 AM IST

గద్దర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన రాజకీయ లబ్దికోసం వాడుకుంటుంది. క్యాడర్ లేకుండా బలహీనంగా ఉన్న కంటోన్మెంట్ టికెట్ కేటాయింపు అంటే అవుననే అనిపిస్తుంది. అక్కడ పోటీకి ఎవరు ముందుకు రాకపోవడంతో గద్దర్ కూతురుకు కేటాయింపు. మరో శంకరమ్మలా మారనున్న వెన్నెల రాజకీయ భవిష్యత్తు. 
గద్దర్ కుటుంబంపై కాంగ్రెస్ కు అంత ప్రేమ ఉంటే MLC కానీ వరంగల్ ఎంపీ టికెట్ కానీ ఇవ్వొచ్చు కదా...

గద్దర్ చనిపోయినపుడు అంతా తానై చూసుకున్న పిసిసి, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారికి తెలియదా కంటోన్మెంట్ లో టికెట్ ఇస్తే వెన్నెల ఓడిపోతుందని.  తను ఎంపీగా పోటీ చేసినప్పుడే కంటోన్మెంట్ అసెంబ్లీలో బీఆర్ఎస్ కి లీడ్ వచ్చింది. 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తె తానే సీఎం అవుతా అంటున్న రేవంత్ రెడ్డి గారు గద్దర్ కుటుంబానికి తన కేబినెట్ లో చోటు కల్పించొచ్చు లేదా నామినేటెడ్ ఎమ్మెల్సీ లేదా ఎంపీ ఇవ్వొచ్చు కదా.....

ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన నామ మాత్రపు పోటీగా శ్రీకాంతచారి కుటుంబానికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి శంకరమ్మ ఓటమికి కారణమైంది. ఈ టికెట్ విషయంలో కెసిఆర్ పైన ఉద్యమ కారులు, తెలంగాణ మేధావి సమాజం తీవ్ర విమర్శలు చేశారు. శంకరమ్మ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ చిత్త శుద్దిని ప్రశ్నించింది. ఇప్పుడు గద్దర్ ఫ్యామిలీ రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలాంటి తప్పే చేస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios