బిజెపి నేత... ఆనాటి కాంగ్రెస్ కురువృద్ధుడు కాకా వెంకటస్వామి కొడుకు అయినటువంటి వివేక్ తెలంగాణ బిజెపిలో కీలకంగా వ్యవహరిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అందుకే ఈ మధ్య టిఆర్ఎస్ శ్రేణులకు సోషల్ మీడియాలో టార్గెట్ గా మారాడు. రోజు కెసిఆర్ పై టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచకపడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నాడు. అలాగే అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు టార్గెట్ గా కూడా మారుతున్నాడు. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురవుతున్నాడు. ఈ మధ్య తన సోషల్ మీడియా అధికారిక పేజీ గురించి ఆ పేజీ తనది కాదని అంటూ టిఆర్ఎస్ శ్రేణులు విపరీతంగా ట్రోలింగ్ చేశాయి. రాష్ట్రంలో ఏ సంఘటన కొత్తగా జరిగినా దానికి వివేక్ ను జత చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మధ్య షర్మిల పార్టీ లో వివేక్ చేరుతున్నారంటూ టిఆర్ఎస్ శ్రేణులు ప్రచారం మొదలెట్టాయి. దానికి ఈ రోజు వివేక్ ఖండిచాల్సి వచ్చింది.

అయితే ఇదంతా వివేక్ టిఆర్ఎస్ పార్టీ పై రోజుకు తన విమర్శల దాడి పెంచటంతోనే టిఆర్ఎస్ శ్రేణులకు టార్గెట్ గా మరుతున్నాడని వివేక్ అనుచరులు వాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా తన సొంత మీడియా ఛానెల్ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా బయటపెట్టడంలో ముందు ఉంటుంది. ఇది కూడా తెలంగాణ బిజెపి పార్టీ కు బాగా కలిసి వచ్చే అంశం. తెలంగాణ బిజెపి పార్టీ కూడా రాష్ట్రంలో ఈమధ్య కీలకం కావటానికి వివేక్ సొంత మీడియా చాలా సహకరించింది. దాని వల్లే బిజెపి టిఆర్ఎస్ పార్టీ కి ధీటుగా  నిలబడగలిగింది. దాంతో బిజెపి పార్టీ కూడా ఒక దళిత నాయకునిగా వివేక్ కు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ అతన్ని బిజెపి పార్టీ అన్ని సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనేలా  చేస్తుంది. 

కేంద్రం కూడా వివేక్ కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎప్పుడు వివేక్ ఢిల్లీ వెళ్లినా కానీ ప్రముఖ నాయకులతో వరుస భేటీలు అవుతూ తన పార్లమెంట్ నియోజవర్గ సమస్యల గురించి చర్చిస్తూ వార్తల్లో ఉంటున్నాడు. ఈ మధ్య తన నియోజక వర్గంలోని ఎరువుల ఫ్యాక్టరీ ని ప్రారంభించటానికి కేంద్ర హోమ్ శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని వెంట తీసుకెళ్లి మరీ కేంద్ర ఎరువుల మంత్రి సదానంద గౌడ ను కలిసి వచ్చారు. ఏది ఏమైనా బిజెపిలో ప్రస్తుతం వివేక్ కీలకంగా వ్యవహరిస్తూనే ఉన్నా టిఆర్ఎస్ శ్రేణులకు మాత్రం విపరీతమైన టార్గెట్ గా మారటంతో, తన తండ్రి ప్రజల కోసం, తెలంగాణ కోసం చేసిన పోరాటాలే స్ఫూర్తిగా తాను అదే విధంగా, అంతే ఆత్మస్థైర్యంతో పని చేస్తానని, ఎవరి బెదిరింపులకు, ఎవరి దుష్ప్రచారాలకు భయపడనంటూ వివేక్ ట్వీట్ చేయటంతో అది కాస్తా బిజెపి పార్టీ సోషల్ మీడియా శ్రేణుల్లో వైరల్ గా మారింది.