నిజాముద్దీన్ ప్రార్థనలు: సూపర్ స్ప్రెడ్డర్లుగా మారుతున్నారా? లెక్కలు ఇవీ...
కరోనా వైరస్ వ్యాప్తి భారతదేశంలో కంట్రోల్ లోనే ఉంది అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ నిజాముద్దీన్ లో ప్రార్థనలకు హాజరయినవారిలో చాలామంది కరోనా పాజిటివ్ లు గా తేలడం, వారంతా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉండడం ఇప్పుడు భయానక వాతావరణానికి కారణమవుతుంది.
కరోనా వైరస్ అనే పేరు చెబితేనే ఇప్పుడు ప్రపంచం వణికి పోతుంది. ఆ మహమ్మారి భయానికి ప్రపంచమంతా ఇండ్లలోనే ఉండిపోయి లాక్ డౌన్ పాటిస్తున్నారు. మనదేశంలో ఇప్పుడిప్పుడే వైరస్ ప్రబలుతోంది. దానికి అడ్డుకట్ట వేయడానికి మన దేశం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది.
కరోనా వైరస్ వ్యాప్తి భారతదేశంలో కంట్రోల్ లోనే ఉంది అనుకుంటున్న తరుణంలో ఢిల్లీ నిజాముద్దీన్ లో ప్రార్థనలకు హాజరయినవారిలో చాలామంది కరోనా పాజిటివ్ లు గా తేలడం, వారంతా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉండడం ఇప్పుడు భయానక వాతావరణానికి కారణమవుతుంది.
వీరంతా ఢిల్లీ నుండి వెళ్ళేటప్పుడు వైరస్ బారినపడి తెలియకుండా రకరకాల రవాణా సదుపాయాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు. వారిలో ఇప్పుడు వైరస్ లక్షణాలు బయటపడడమే కాకుండా వారిప్పుడు వారి ఊర్లలో అనేకమందితో కలిశారు. వారందరు కూడా ఇప్పుడు కరోనా వైరస్ బారినపడే ప్రమాదముంది.
Also Read డిల్లీలో కరోనా కలకలం... మర్కజ్ నిజాముద్దిన్ పెద్దలపై చర్యలు...
దేహసంలో అంత అదుపులోనే ఉందనుకుంటున్న తరుణంలో వీరంతా ఇలా సూపర్ స్ప్రెడ్డర్లు గా మారనున్నారు అనే భయం ఇప్పుడు అధికారుల్లో నెలకొంది. ఈ నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లారు.
ఢిల్లీలోని తబ్లిగ్ ఈవెంట్ కు సంబంధించి మాత్రమే ఇప్పటివరకు భారతదేశ వ్యాప్తంగా 91 కేసులు నమోదయ్యాయి. చెన్నైలో 57 మంది పాజిటివ్ గా తేలితే... అందులో 50 మంది ఢిల్లీలోని ఈ తబ్లిగ్ సంస్థ ప్రార్థనలకు హాజరయ్యి వచ్చారు.
ఈ ఈవెంట్ కు సంబంధించి ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్ లో ఒక మృతి సమ్హవించగా తెలంగాణలో 6మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 24 కేసులు,తమిళనాడులో 50 కేసులు, లో 10 కేసులు నమోదయ్యాయి. మన తెలంగాణలో పరిస్థితి చాలా భయానకంగా కనబడుతుంది.
తెలంగాణ పరిస్థితి....
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77కు చేరింది. వీరిలో ఆరుగురు మృతి చెందారు. మృతులంతా ప్రార్థనలకు వెళ్ళివచ్చినవారే. నిన్న ఒక్కరోజే మర్కజ్ నుంచి వచ్చినవారిలో 15 మంది కరోనా పాజిటివ్ గా తేలారు.
హైద్రాబాద్ నుండే అత్యధికంగా 603 మంది ఈ ప్రార్థనల్లో పాల్గొనేందుకు వెళ్లినట్టుగా గుర్తించారు. అయితే ఈ సమావేశాలకు వెళ్లినవారి సమాచార సేకరణకు జీహెచ్ఎంసీ, పోలీస్, రెవిన్యూ అధికారులతో ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటు చేసింది సర్కార్. ఇక జిల్లాల్లో రెవిన్యూ, పోలీసులతో పాటు వైద్యులతో కమిటిలను ఏర్పాటు చేశారు.
హైద్రాబాద్ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ప్రార్థనలకు హాజరైన వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం నాడు రాత్రి వరకు ట్రాకింగ్ పూర్తి చేయనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన వారే కారణమని ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి. ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత క్వారంటైన్ లో లేకపోవడంతో పాటు ఇతరులతో సన్నిహితంగా ఉన్న కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణమైందనే ప్రభుత్వవర్గాలు అభిప్రాయంతో ఉణ్నాయి.
జిల్లాల వారీగా నిజాముద్దీన్ కు వెళ్లి వచ్చిన వారి సంఖ్య...
హైద్రాబాద్- 603
ఆదిలాబాద్-30
కొత్తగూడెం -11
జగిత్యాల-25
జనగామ- 4
భూపాలపల్లి- 1
గద్వాల -5
కరీంనగర్ -17
ఖమ్మం -27
మహబూబాబాద్- 6
మహబూబ్ నగర్- 11
మంచిర్యాల- 10
మెదక్ -2
మేడ్చల్ -2
ములుగు- 2
నాగర్ కర్నూల్- 4
నల్గొండ -45
నిర్మల్ 25
నిజామాబాద్- 80
పెద్దపల్లి- 6
సిరిసిల్ల- 9
రంగారెడ్డి- 13
సంగారెడ్డి- 22
సూర్యాపేట- 3
వనపర్తి- 3
వికారాబాద్- 7
వరంగల్ రూరల్- 1
వరంగల్ అర్బన్- 38
యాదాద్రి భువనగిరి- 4
దేశం యావత్తులో ఈ ప్రార్థనలకు హాజరయినోళ్లు ఉండడంతో ఇప్పుడు అధికారుల్లో వీరు సూపర్ స్ప్రెడ్డర్లు అవుతారా అనే భ్యయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని ఇప్పటికే గుర్తించి ఐసొలేషన్ వార్డులకు పంపారు. వారెవరెవర్నీ కలిశారు అని కూడా ఆరా తీస్తూ వారిని కూడా క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వీరు ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు వెళ్ళేటప్పుడు రకరకాల ప్రయాణ సాధనాలను ఉపయోగించారు. వారు రైళ్లలో, బస్సుల్లో, విమానాల్లో ప్రయాణించారు. ఆ ప్రయాణంలో వీరితో కాంటాక్ట్ లోకి వచ్చినవారికంతా కూడా ఈ వైరస్ సోకె ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వారందరిని ఎలా గుర్తించాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
తబ్లిగ్ సంస్థ ఇలా నిషేధాజ్ఞలున్నప్పటికీ కార్యక్రమాలను నిర్వహించడం తప్పు. వారిపైన చర్యలను తీసుకునే కన్నా ముందు ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని వారి కుటుంబాలతోపాటుగా వారు కలిసిన వారందరిని కూడా ఐసొలేషన్ కేంద్రాలకు తరలించాలి.
సాధ్యమైనంత త్వరగా వీరందరిని వేరు చేయగలిగితే మంచిది. ఢిల్లీ వెళ్లి వచ్చినవారిని కలిసిన వ్యక్తులు, వారి బంధువులు సాధ్యమైనంత మంది స్వచ్చంధంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించాలి.
ప్రభుత్వం కూడా మరిన్ని టెస్ట్ కిట్లను సమకూర్చుకొని టెస్టింగులను భారీగా పెంచాలి. అదొక్కటే ఇప్పుడు మార్గం. లేదంటే మాత్రం పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉంది.
ఈ సంకట సమయంలో ప్రజలంతా ఇలా ఎవరైనా వెళ్లి వచ్చినవారుంటే ఫోన్ చేసైనా ప్రభుత్వానికి సమాచారం అందించాలి. ఇలాప్రభుత్వంతో పూర్తిగా ప్రజలు సహకరించినప్పుడు మాత్రమే ఈ కరోనా మహమ్మారిని మనం ఎదుర్కోగలము.
ఇలా గనుక పూర్తి ప్రజల సహకారం లభించకపోతే మాత్రం అసలే అరా కోర వైద్య సదుపాయాలు కలిగిన అభివృద్ధి చెందుతున్న మన దేశం మీద ఈ కరోనా మహమ్మారి గనుక ఏ ఇటలీ లెవెల్ లో గనుక పంజా విసిరితే... మనం తట్టుకోవడం కష్టం.