కరోనా టీకాపై జగన్ వ్యాఖ్యలు: మే 1నుంచి 18+ వారికి టీకా డౌట్

18 ఏళ్లు దాటినవారికి కరోనా వ్యాక్సిన్ సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభం కావచ్చునని జగన్ చెప్పారు.

Corona Virus Vaccination: AP CM YS Jagan Says vaccination to above 18 years may not start by september, A Look At Reality...

హైదరాబాద్: కరోనా వైరస్ టీకాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. 18 ఏళ్లు దాటినవారికి కరోనా వ్యాక్సిన్ సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభం కావచ్చునని జగన్ చెప్పారు. వ్యాక్సిన్ నిల్వల పరిస్థితి గురించి కూడా మాట్లాడారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల వయస్సు దాటిన అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి గల అవకాశాలను, దాని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే సంశయం కలగక మానదు. టీకా కోసం తమ పేర్లు నమోదు చేసుకుంటున్నవారి సంఖ్య దండిగానే ఉంది. పేర్లు నమోదు చేసుకునే వరకే ఇప్పుడు అవకాశం ఉంటుందని, టీకా ఇచ్చే తేదీలను తర్వాత ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.

ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో మే 1వ తేదీ నుంచి వాక్సినేషన్ ప్రారంభం కావడం సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. వాక్సిన్ సరఫరా చాలా తక్కువగా ఉందని, 18 ఏళ్ల వయస్సు పైబడినవారిిక టీకా ఇచ్చే కార్యక్రమంలో తాము పాల్గొనబోమని మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు చెప్పాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.

మే 15వ తేదీలోగా వాక్సిన్ ను అందించలేమని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తమకు చెప్పినట్లు రాజస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. తమను సీరమ్ ఇనిస్టిట్యూట్ తో మాట్లాడాల్సిందిగా చెప్పారని, తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చాయని, అందువల్ల తమకు మే 15వ తేదీ వరకు సమయం కావాలని సీరమ్ ఇనిస్టిట్యూట్ చెప్పిందని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ మీడియాకు చెప్పారు.

అందువల్ల నేరుగా రాష్ట్రాలు వాక్యిస్ పొందడానికి ఉన్న ప్రక్రియ ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోందని, ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, 18-45 ఏళ్ల మధ్య వయస్సు గలవారు తమ రాష్ట్రంలో 3.13 కోట్ల మంది ఉన్నారని, వారికి ఎలా వ్యాక్సిన్ అందించగలమని ాయన అన్నారు

రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి పంజాబ్, చత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో మాట్లాడారు వారంతా మీడియాతో మాట్లాడారు తాము డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ధరలు ఒకే విధంగా ఉండాలని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు. శర్మ డిమాండ్ ను చత్తీస్ గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దేవ్, పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధు బలపరిచారు.

వాక్సిన్ నిల్వలు లేనందున 40 ప్రైవేట్ వాక్సినేషన్ సెంటర్లను ఈ నెల 29వ తేదీన మూసేస్తున్నట్లు మహారాష్ట్ర తెలిపింది. మిగతా 33 ప్రైవేట్ వాక్సినేషన్ సెంటర్ల వద్ద పరిమిత వాక్సిన్ మాత్రమే ఉందని, వాటిని రెండో డోసు కోసం వాడనున్నట్లు తెలిపింది.

30 లక్షల కోవీషీల్డ్ డోసులకు ఆర్జర్లు ఇవ్వాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాష్్ర ఆరోగ్య శాఖను ఆదేశించారు. అయితే 18-45 మధ్య వయస్సు గలవారికి టీకా ఇచ్చేందుకు మే 15వతేదీలోగా వాక్సిన్ అందే అవకాశాలు లేవని జాతీయ మీడియాలో ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. 

ఇకపోతే మే 1వ తేదీ నుండి 18 సంవత్సరాల పైబడ్డ అందరికీ వాక్సిన్ ఇచ్చేనందుకు కేంద్రం నిర్ణయించి కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకోమని చెప్పినప్పటికీ... అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న కూడా స్లాట్స్ బుక్ అవడం లేదు. కాబట్టి వాక్సిన్ ఎప్పటినుండి అందరికి అందుబాటులోకి వస్తుందనే విషయంలో క్లారిటీ లేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios