"మహా" కరోనా రాజకీయం: సీఎం గవర్నర్ మధ్యలో యెస్ బ్యాంక్ నిందితులు

కరోనా వైరస్ కోరలు చాస్తున్నవేళ ప్రజలు ,ప్రభుత్వాలు ఆ విషయంలో నిమగ్నమయి ఉంటే.... రాజకీయ నాయకులు మాత్రం పొలిటికల్ ఈక్వేషన్స్  వేసుకుంటూ బిజీగా ఉన్నారు. వారి రాజకీయాలకు అంతా మంచి సమయమే అన్నట్టుగా దూసుకుపోతున్నారు. 

Corona Power Tussle in Maharashtra: Officers acting according to their whims and fancies

కరోనా వైరస్ కోరలు చాస్తున్నవేళ ప్రజలు ,ప్రభుత్వాలు ఆ విషయంలో నిమగ్నమయి ఉంటే.... రాజకీయ నాయకులు మాత్రం పొలిటికల్ ఈక్వేషన్స్  వేసుకుంటూ బిజీగా ఉన్నారు. వారి రాజకీయాలకు అంతా మంచి సమయమే అన్నట్టుగా దూసుకుపోతున్నారు. 

తాజాగా మహారాష్ట్రలో ఈ పరిస్థితి తార స్థాయికి చేరుకుంది. అక్కడ ప్రజలెన్నుకున్న ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఉండగా గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ మరో పవర్ సెంటర్ గా మారారు. వీరిరువురి మధ్య పోరులాగా అది కనబడ్డప్పటికీ... వాస్తవానికి అది అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాది( శివసేన+కాంగ్రెస్+ఎన్సీపీల కూటమి) కి, ప్రతిపక్ష బీజేపీకి మధ్య యుద్ధం. 

ఈ కరోనా కష్టకాలంలో కేంద్రం మాకు విడుదల చేయాల్సిన నిధులను, వైద్య పరికరాలను ఇవ్వట్లేదు అని శివసేన ఆరోపిస్తుంటే.... రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో విఫలమైందని, జైలు భరో కార్యక్రమాలకు పిలుపు ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపిస్తున్నారు. 

ఈ కష్ట కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన ప్రతిపక్షం చిల్లర రాజకీయాలు చేస్తుందని అధికార వర్గాలతో పాటుగా సమాజంలోని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఉద్ధవ్ ఠాక్రే చాలా బాగా పనిచేస్తున్నాడు అనే చెప్పాలి. అంత పెద్ద ముంబై లాంటి మహానగరాన్ని చాలా ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేస్తున్నాడని చెప్పవచ్చు. 

ఇక్కడ అందరికి ఒక ప్రశ్న ఉద్భవించొచ్చు. మరి కేసులు ఎందుకు అక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయి అని. సింపుల్ కారణం అక్కడ టెస్టింగ్ విపరీతంగా జరుగుతుంది. ఒక రెండు మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా ఎన్ని టెస్టులు జరుగుతున్నాయో, మహారాష్ట్రలో అన్ని టెస్టులు, ముఖ్యంగా ముంబై లో జరుగుతున్నాయి. \

అందువల్ల అక్కడ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వారి ప్లానింగ్ కూడా బాగుంది. ఇప్పటికే ఎమర్జెన్సీ కేర్ కోసం ఆసుపత్రులను సిద్ధం చేసారు కూడా. ఐసొలేషన్ కేంద్రాలను కూడా అధికంగా రెడీ చేసి ఉంచారు. 

బీజేపీ వారి స్వార్థపూరిత రాజకీయాల కోసం మాత్రమే ఈ సమయంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని అధికార శివసేన ఆరోపిస్తోంది. చీటికీ మాటికీ గవర్నర్ వద్దకు బీజేపీ నాయకులు వెళ్లి ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇలా గవర్నర్ వర్సెస్ సీఎం గా రాష్ట్రంలో పరిస్థితులు ఉండడంతో అక్కడి అధికారులు తమ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు.  తాజాగా మహారాష్ట్ర స్పెషల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గా ఉన్న అమితాబ్ గుప్తా ఎస్ బ్యాంకు స్కాం లో సహా నిందితుడు అనిల్ వాధ్వాన్ కి ఆయన కుటుంబ సభ్యులకు నాలుగు కార్లలో ఖండాల నుండి మహాబలేశ్వర్ వరకు వెళ్ళడానికి ప్రత్యేక పర్మిషన్ ఇచ్చాడు. 

కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్, చీటింగ్ ఇలా ర్రకారకాల కేసులు ఈయన మీద ఉన్నప్పటికీ ఇంతవరకు ఆయన మీద ఇటు శివసేన కూటమి కానీ అప్పట్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చర్యలు తీసుకోలేదు. 

ఈ లాక్ డౌన్ సమయంలో అస్లు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చిందనిధి ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే. ఇలా పాసులు జారీ చేశాడన్న విషయం హోమ్ మంత్రికే తెలియదు. హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్య నెవ్వరపోయి విచారణకు ఆదేశించాడు. అమితాబ్ గుప్తాను విచారణ పూర్తయ్యేంతవరకు ప్రత్యేక సెలవు పై పంపించారు. 

ఇక ఇది ఇలా ఉండగా బీజేపీ నేతలు తాజాగా మహారాష్ట్ర గవర్నర్ ని కలిసి వాద్వాన్ సోదరులకు కాన్వాయ్ కల్పించి ట్రావెల్ పాసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమే అని, దానిపై విచారణ జరిపించాలని వారు కోరారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ దాదా పాటిల్, మాజీ ఎంపీ కిరీట్ సోమయా వెళ్లి గవర్నర్ కి ఇందుకు సంబంధించి వినతిపత్రం ఇచ్చారు. 

కరోనా వైరస్ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దానితో గవర్నర్ కోటాలో ఉద్ధవ్ ఠాక్రే ను ఎమ్మెల్సీగా నియమించామని గవర్నర్ ని కోరారు. దానిపై కూడా వివాదం నడుస్తుంది. 

చూడాలి ఈ కరోనా వేళ మహారాష్ట్ర రాజకీయం ఎంత రంజుగా సాగుతుందో. కాకపోతే ఈ రాజకీయాల్లోపడి ప్రజలను పట్టించుకోవాల్సిన సమయంలో వారిని గాలికి వదిలేయకూడదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios