చంద్రబాబుకు ఝలక్: కేసీఆర్ వ్యూహంతోనే జగన్...
అర్జెంటు గా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లవలిసిన అవసరం జగన్ కు ఏముందని అందరూ లోలోన అనుకుంటున్నప్పటికీ, కొద్దీ మంది బాహాటంగానే బయటపెట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావించారు. అయినప్పటికీ జగన్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేసేసింది
ఆంధ్రప్రదేశ్ లో బీసీ రేజర్వేషన్లపై హై కోర్టు చివాట్లు పెట్టడం, వేణు వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేయకుండా ఉన్నపళంగా జగన్ సర్కార్ రేజర్వేషన్లను కుదించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుంది.
ఇంత అర్జెంటు గా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లవలిసిన అవసరం జగన్ కు ఏముందని అందరూ లోలోన అనుకుంటున్నప్పటికీ, కొద్దీ మంది బాహాటంగానే బయటపెట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావించారు. అయినప్పటికీ జగన్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేసేసింది.
కేవలం 22 రోజుల వ్యవధిలోనే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ఒక్క దెబ్బకు అటు కార్పొరేషన్ల నుంచి మొదలు సర్పంచు ఎన్నికల వరకు అన్నిటిని ఖతం చేయాలనీ జగన్ చూస్తున్నారు.
Also read: టీడీపీకి సతీష్ రెడ్డి రాజీనామా: కన్నీళ్లను అదుముకొంటూ
చూడడానికి ఇదేదో ఎప్పుడు జరిగే ఎన్నికల తంతు అని అందరికి అనిపించినప్పటికీ... దీని నుండి మాత్రం బలమైన లాభం పొందాలని చూస్తున్నారు జగన్. ఆయన తన పొలిటికల్ మైలేజ్ ను పెంచుకునేందుకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను వాడుతున్నారనేది తేటతెల్లమయ్యే విషయం.
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే... 2019 పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణ లోని తెరాస పరిస్థితిని ఒకసారి చూస్తే మనకు అసలు విషయం అవగతమవుతుంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లను గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన తెరాస చావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచింది.
తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టయిన ఉత్తర తెలంగాణలో సీట్లను కోల్పోయింది. కెసిఆర్ కూతురు కవిత కూడా ఓటమి పాలయింది. ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఒక్క సారిగా అందరూ కూడా తెరాస వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అని భావించడం మొదలుపెట్టారు.
ఇక ఆతరువాత కొద్దీ రోజులకే పరిస్థితి ఇలా ఉండగానే... ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. పార్లమెంటు ఎన్నికల దెబ్బకు ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా తోడవడంతో రాజకీయ వాతావరణం కేసీఆర్ కు వ్యతిరేకంగా మారుతుందని అందరూ భావించసాగారు.
ఈ సమ్మె కాలంలోనే హుజూర్ నగర్ ఉప ఎన్నిక కూడా జరిగింది. ఆ ఎన్నికలో ఏకంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సీటు నుంచి తన భార్యను గెలిపించుకోలేకపోయారు.
పుండు మీద కారం చల్లినట్టు సైది రెడ్డి 50 వేల మెజారిటీ సాధించారు. సైది రెడ్డి గెలుపుతో కెసిఆర్ ఒక రకంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెపైన మానసికంగా పైచేయి సాధించారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన తరువాత కేసీఆర్ వారితో మాట్లాడి వారిపై వరాల జల్లు కురిపించారు. వెంటనే ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లారు. జనవరి లో జరిగిన ఎన్నికల్లో తెరాస విజయ కేతనం ఎగురవేసింది.
ఈ రెండు ఎన్నికలు ముగిసిన తరువాత కెసిఆర్ తెలంగాణాలో తానే బలమైన నాయకుడినని మరోసారి ప్రూవ్ చేసుకొని ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేయించడంలో సఫలీకృతుడయ్యాడు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే దారిలో పయనిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి మూడు రాజధానుల అంశం వల్ల ప్రతిపక్షం ఎదురుదాడికి దిగుతున్నవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో గనుక అఖండ విజయం సాధిస్తే... ప్రతిపక్షాన్ని కట్టడి చేయొచ్చు అనేది జగన్ వెర్షన్ గా కనబడుతుంది.
గతంలో కెసిఆర్ తో జగన్ భేటీ అయినప్పుడు మధ్యలో ఫోన్ సంభాషణల్లో కూడా జగన్ కు ఈ విషయమై కేసీఆర్ సాధ్యమైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించుకోమనే సలహా కూడా ఇచ్చినట్టు ఊహాగానాలు వినబడుతున్నాయి.
ఇప్పటికే క్లిష్టమైన స్థానాల్లో ఎన్నికలను వాయిదా వేశారు. వీలున్న చోటల్లా బలమైన రెండవశ్రేణి నాయకులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ కూడా గేట్లు బార్లా తెరిచారు.
Also read; త్వరలో స్థానిక ఎన్నికలు... జగన్ పైకి చంద్రబాబు బీసీ అస్త్రం?
డబ్బు మద్యం పంచితే కఠిన చర్యలు అని ఒక ఆదేశాన్ని కూడా జారీ చేసారు. మద్యం దుకాణాలను నిరవధికంగా ఎన్నికల వరకు మూసివేశారు. ఇలా అన్ని చర్యలను తీసుకుంటున్న నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశమే ఎక్కువ.
ఈ ఎన్నికల ఫలితాల తరువాత జగన్ మరోసారి ప్రజలు తనకు బ్రహ్మ రథం కట్టారని, టీడీపీ మీద ఎదురు దాడికి దిగుతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన అఖండ మెజారిటీతో టీడీపీని మరింత కృంగదీసే ప్లాన్ కూడా లేకపోలేదు.