జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వెనక రహస్యం ఇదేనా....

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్  రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లి నేడు తిరిగి రావాల్సి ఉంది. వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాత అనూహ్యంగా ఆయన పర్యటన వాయిదా పడింది. గన్నవరం ఎయిర్ పోర్టు కు వెళ్ళడానికి కాన్వాయ్ ని కూడా సిద్ధం చేసిన తరువాత అర్థాంతరంగా పర్యటన వాయిదా పడింది. 

AP CM YS Jagan Delhi Tour Cancelled In The Last minute, Is This The Reason Behind...?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్  రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లి నేడు తిరిగి రావాల్సి ఉంది. వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాత అనూహ్యంగా ఆయన పర్యటన వాయిదా పడింది. గన్నవరం ఎయిర్ పోర్టు కు వెళ్ళడానికి కాన్వాయ్ ని కూడా సిద్ధం చేసిన తరువాత అర్థాంతరంగా పర్యటన వాయిదా పడింది. 

పర్యటన వాయిదా పడడానికి ముఖ్య కారణం ఆయనకు అమిత్ షా అపాయింట్మెంట్ దొరకకపోవడమే. నిసర్గ తుఫాను ముంచుకొస్తున్న తరుణంలో మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలతో సమన్వయపరుచుకోవడం కోసం సమయం తీరికలేనందున రాత్రి పొద్దుపోయాక జగన్ కి ఇచ్చిన అపాయింట్మెంట్ ను రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోమ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. 

అయితే తాజాగా రాష్ట్ర బీజేపీ వర్గాల నుంచి ఒక మాట వినిపిస్తోంది. వారు కేంద్ర అధినాయకత్వానికి ఒక లేఖ  రాసినట్టు,అందులో జగన్ తీసుకున్న తాజా చర్యల వల్ల రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులపై అందులో వివరించినట్టు తెలుస్తుంది. 

అధికారిక భవనాలకు పార్టీ రంగుల విషయం నుంచి మొదలు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయం, డాక్టర్ సుధాకర్ విషయం, అన్నిటిగురించి కేంద్రానికి తెలిపారట. ఇదే విషయాన్ని  ఆంధ్రజ్యోతి కథనంగా కూడా ప్రచురించింది. 

జగన్ వాస్తవానికి కేంద్ర పెద్దలను కలవడానికి ప్రధాన కారణాల్లో నీటి ప్రాజెక్టులతోపాటుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం కూడా ఒకటి.బీజేపీ నేత కామినేని శ్రీనివాస రావు దాఖలు చేసిన పిల్ వల్లనే ఈ కేసు ఇక్కడిదాకా వచ్చిందనేది అందరి నోటా వినబడుతున్నమాట. ఆయన కాకపోతే టీడీపీ వారైనా కేసు దాఖలు చేసేవారు. కానీ ఆయన కేసు దాఖలు చేయడమీ కాకుండా కేంద్ర పెద్దల అనుమతితోనే కేసును దాఖలు చేసినట్టు చెప్పడం ఇక్కడ కొసమెరుపు. 

ఆయన కేసు దాఖలు చేయడం, కోర్టు తీర్పు జగన్ సర్కారుకు వ్యతిరేకంగా రావడం, వారు సుప్రీమ్ ని ఆశ్రయించడం, అక్కడ కూడా కామినేని శ్రీనివాస రావు కావియెట్ పిటిషన్ దాఖలు చేయడం కొసమెరుపు. 

ఇలా కామినేని శ్రీనివాసరావు కేసును దాఖలు చేయడం వెనకున్న కారణాలేమిటి, ఆయన పెద్దల అనుమతితోనే కేసు వేశానని ఎందుకు నొక్కి చెప్పారు? జగన్ మోహన్ రెడ్డి సర్కారు పై కేంద్ర అధినాయకత్వం ఎటువంటి వైఖరి తీసుకోబోతుంది అనేవి ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు. 

జగన్ సర్కారుపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం యుద్ధం ప్రకటిస్తున్నప్పటికీ... కేంద్రం మాత్రం సఖ్యతగానే ఉంటుంది. కేంద్ర నాయకులెవ్వరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడరు. తెలంగాణాలో ఇంతకుమునుపు కేసీఆర్ తో వ్యవహరించిన తీరుకూడా అదే. 

బీజేపీ పనిచేసే విధానమే అలా ఉంటుంది. రాష్ట్రంలో తమ పార్టీకి అంతగా అవకాశాలు లేవు అన్నప్పుడు అక్కడి అధికార పార్టీకి జూనియర్ పార్టనర్ గా బీజేపీ మెలుగుతోంది. అలా మెలుగుతూ సందు దొరికితే ప్రధాన ప్రతిపక్ష స్థాయిని అందుకోవాలని చూస్తుంది. 

ఇక్కడ ఏపీలో బీజేపీ అదే పని చేస్తుంది. సమయం చిక్కినప్పుడల్లా వైసీపీమీద కారాలు మిర్యాలు నూరుతుంది. జగన్ పై సాధ్యమైనంత మేర హిందుత్వ కార్డును వాడాలని బలంగా విశ్వా ప్రయత్నాలను చేస్తుంది. అందుకు టీటీడీ అంశాలను ఏరికోరి ఎంచుకుంటుంది రాష్ట్ర బీజేపీ. 

అయితే ఇదంతా జరుగుతున్నప్పటికీ కేంద్రంలో మాత్రం వీరి ఎంపీలతో రాజ్యసభలో అవసరం ఉండడం, ఇతర కారణాల నేపథ్యంలో వీరితో మాత్రం సఖ్యంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు జగన్ కి ఇచ్చిన అపాయింట్మెంట్  ను రద్దు చేయడం ద్వారా రాష్ట్ర సర్కారుకి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తుందనేదియూ ఆసక్తికరంగా మారింది. 

రాష్ట్రానికి కేంద్రం ఎంత దగ్గర సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పటికీ.... అన్ని విషయాల్లోనూ ఇలా ఇష్ఠానుసారం వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోలేము అన్న సిగ్నల్స్ ఇస్తుందా అనే అనుమానాలు ఇక్కడ కలుగుతున్నాయి. 

ఇలాంటి అనుమానాలు కలగడానికి మరో కారణం కూడా లేకపోలేదు. నిన్న పర్యటన రద్దయిందని తెలియగానే జగన్ విజయసాయి రెడ్డి,   మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. దానితరువాత ఈ వాదనలకు మరింత బలం చేకూరింది. 

రాష్ట్రంలో ఇటు టీడీపీతో, అటు వైసీపీతో కేంద్రం సమాన సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తోంది. భవిష్యత్తులో ఎవరితో అవసరం వస్తుందో ఏమో, ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే కేంద్రం ఈ సారికి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిందా అని ఒక వర్గం వాదన. 

కానీ అన్ని పరిస్థితులను చూస్తుంటే రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. టీటీడీ విషయంలో బీజేపీ బలమైన పోరాటం సలిపింది. ముఖ్యంగా హిందుత్వ కార్డును బీజేపీ బలంగానే ప్రయోగించింది. వారు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకుకునేలా కనబడడం లేదు. 

రాష్ట్రంలో వైసీపీ పాలనపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక రకముగా హింస ప్రజ్వరిల్లుతోంది అనే విధంగా ప్రొజెక్ట్ చేయడంలో టీడీపీ సక్సెస్ అయింది. మీడియాలో కూడా ఆ విషయాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. 

ఇదే అదునుగా బీజేపీ అక్కడ ఎదగాలని చూస్తుందా అంటే అవుననే సమాధానంగా కనబడుతుంది. రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రంజుగా మారుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios