ఏపీ బడ్జెట్: కరోనా లెక్కలోనే లేదు, సంక్షేమానికి పెద్ద పీట
రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వం ఇంతభారీ స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టింది, సంక్షేమ పథకాలకు పెద్దపీట కూడా వేసింది. కానీ ఇంత భారీమొత్తంలో కరోనా వేళ నిధులను ఎలా సమీకరిస్తారన్నది ఇక్కడ ఉత్పన్నమవుతున్నప్రశ్న.
2020-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ని నేడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో అందరూ ఊహించినట్టే సంక్షేమానికి పెద్దపీటవేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. దాదాపుగా 21 సంక్షేమపథకాలకు సంబంధించిన కేటాయింపులను చేసారు.
రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ప్రభుత్వం ఇంతభారీ స్థాయిలో బడ్జెట్ ని ప్రవేశపెట్టింది, సంక్షేమ పథకాలకు పెద్దపీట కూడా వేసింది. కానీ ఇంత భారీమొత్తంలో కరోనా వేళ నిధులను ఎలా సమీకరిస్తారన్నది ఇక్కడ ఉత్పన్నమవుతున్నప్రశ్న.
బయటప్రపంచన్నియో ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారి కుదిపేస్తోంది. అన్ని దేశాలు కూడా ఆర్థికమందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. గత మూడు నెలలుగా ఆర్ధిక వృద్ధి దాదాపుగా లేనట్టే. లాక్ డౌన్ ఎత్తేసి కేవలం కొన్నిరోజులు మాత్రమే అయింది. ఇంకా పూర్తిస్థాయి లాక్ డౌన్ ను ఎత్తేయలేదు.
మరొపక్కనేమో కేసులు అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. కంటికి కనిపించని ఈ మహమ్మారితో అన్ని రాష్ట్రాలు యుద్ధం చేస్తున్నాయి. మరొపక్కనేమో తమిళనాడులో కేసులు ఎక్కువవడం, వ్యాప్తి అధికంగా ఉండడంతో నాలుగు జిల్లాల్లో మరల సంపూర్ణ లాక్ డౌన్ ని విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ ను విధించింది ప్రభుత్వం.
ఎప్పుడు ఎక్కడ కేసులు అధికంగా నమోదవుతాయో, ఎక్కడ వైరస్ విశృంఖలంగా వ్యాపిస్తుందో అని అందరూ భయంతో వణికిపోతున్నారు. ఒకవేళ గనుక వైరస్ మరోమారు ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేస్తే ఉన్న అతికొద్ది ఆర్థిక వనరులు కూడా అడుగంటిపోయే ప్రమాదం ఉంది.
ఇప్పటికే కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం ప్రధాన మంత్రితోసహా అందరు ఎంపీల జీతభత్యాల్లో సంవత్సరం వరకు 30 శాతం కొత్త విధించింది. ఎంపీలాడ్స్ మీద కూడా ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి తరుణంలో ఇంత భారీ స్థాయిలో సంక్షేమపథకాలకు నిధులను కేటాయించడంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. భారతదేశం వంటివో అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా అప్పుల బయటపెట్టిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కలలో ఉద్యోగుల జీతాల్లో కొత్త విధించిన విషయం తెలిసిందే. ఇంకా వాటిని కూడా చెల్లించలేదు. వాటిని కూడా త్వరలోనే ఉద్యోగులకు అందించాలి.
పక్కనున్న తెలంగాణ రాష్ట్రం తన బడ్జెట్ లో క్లియర్ గా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావాన్ని బేరీజు వేసుకొని బడ్జెట్ ని రూపొందించారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో ఎలా సమీకరిస్తుందనేదానిపై క్లారిటీ ఇవ్వవలిసిన అవసరం ఉంది.