Asianet News TeluguAsianet News Telugu

బైక్ పై హెల్మెట్ తో కుక్క.... నెట్టింట ఫోటో వైరల్

ప్రస్తుతం ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ట్విట్టర్ లో అయితే... ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఏముందంటే..  ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతూ ఓ కుక్కను తీసుకువెళ్తున్నాడు. అతను హెల్మెట్ పెట్టుకోవడంతోపాటు.... కుక్కకి కూడా హెల్మెట్ పెట్టాడు. ఆ కుక్క కూడా చక్కగా హెల్మెట్ పెట్టుకొని వెనక కూర్చోవడం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ఫోటో తెగ వైరల్ అవుతోంది.

This Helmet-Wearing Dog From Delhi Has Won Twitter's Heart
Author
Hyderabad, First Published Oct 24, 2019, 11:35 AM IST

దేశంలో ఇటీవల నూతన మోటారు వెహికల్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేస్తూ... ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని... ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి  భారీ జరిమానాలు కూడా విధించారు. అయితే.... ఈ రూల్స్ అమలులోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజల ఒత్తిడితో ఈ రూల్స్ ని సడలించారు కూడా. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఈ చట్టమే అమలౌతోంది.

AlsoRead అక్రమ సంబంధం... మహిళపై వేడి నూనె పోసిన ప్రియుడు

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ట్విట్టర్ లో అయితే... ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఏముందంటే..  ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతూ ఓ కుక్కను తీసుకువెళ్తున్నాడు. అతను హెల్మెట్ పెట్టుకోవడంతోపాటు.... కుక్కకి కూడా హెల్మెట్ పెట్టాడు. ఆ కుక్క కూడా చక్కగా హెల్మెట్ పెట్టుకొని వెనక కూర్చోవడం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ఫోటో తెగ వైరల్ అవుతోంది.

ఈ మధ్య కాలంలో తమను విపరీతంగా ఆకట్టుకున్న ఫోటో ఇది అంటూ... నెటిజన్లు ఈ ఫోటోని ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు. ఎంత మంచి కుక్కో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ట్రాఫిక్ జరిమానాలకు భయపడి కుక్క కూడా హెల్మెట్ పెట్టుకుందని మరికొందరు కామెంట్స్ చేయడం విశేషం.ఇలా కుక్కకు హెల్మెట్ పెట్టుకొని యజమాని తీసుకువెళ్లిన  ఈ సంఘన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 

మరికొందరు దీనిపై జోకులు కూడా వేస్తున్నారు. అందరూ హెల్మెట్ ధరించాలి అంటూ ఈ ఫోటోని ప్రచారానికి పెట్టుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు. కాగా... గతంలో కూడా ఓ వ్యక్తి ఇలానే కుక్కకి హెల్మెట్ పెట్టుకొని స్కూటీ పై తీసుకువెళ్లాడు. అప్పుడు కూడా ఫోటో తెగ వైరల్ అయ్యింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios