Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి స్పెషల్... 1995 కేజీల కిచిడీ.. గిన్నీస్ రికార్డ్

సట్లెజ్‌ నదీ తీరం వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది 1995 కేజీల కిచిడీని ఒకే పాత్రలో వండి గిన్నిస్‌ రికార్డ్స్‌లోకి ఎక్కారు నిర్వాహకులు. 

Himachal: Chefs prepare 1,995kg of Khichdi on Makar sankranti, set world record
Author
Hyderabad, First Published Jan 16, 2020, 8:14 AM IST

సంక్రాంతి సందర్భంగా.. హిమాచల్ ప్రదేశ్ లో 1995 కేజీల కిచిడీని వండారు. కాగా... ఆ వంటకం ఇప్పుడు గిన్నీస్ వరల్డ్   రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు 55కిలోమీటర్ల దూరంలోని తట్టపాణి గ్రామంలో ఈ కిచిడీని వండారు.

Himachal: Chefs prepare 1,995kg of Khichdi on Makar sankranti, set world record

సట్లెజ్‌ నదీ తీరం వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది 1995 కేజీల కిచిడీని ఒకే పాత్రలో వండి గిన్నిస్‌ రికార్డ్స్‌లోకి ఎక్కారు నిర్వాహకులు. 25 మంది చెఫ్‌లు కలిసి ఐదు గంటల్లో కిచిడీని తయారు చేశారు. 

Also Read జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం చేయిస్తున్న దర్శకుడి అరెస్టు...

ఈ కిచిడీ తయారీ కోసం 450 కిలోల బియ్యం, 190 కిలోల ధాన్యాలు, 90 కిలోల నెయ్యి, 55 కిలోల సుగంధ ద్రవ్యాలు, 1,100 లీటర్ల నీటిని వినియోగించారు. దీంతో గతేడాది ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ తయారు చేసిన 918.8 కేజీల కిచిడీ రికార్డ్‌ బద్దలైంది.

Follow Us:
Download App:
  • android
  • ios