ముంబై: ఓ బాలీవుడ్ క్యాస్టింగ్ డైరెక్టర్ గుట్టును సోషల్ సర్వీస్ బ్రాంచ్ కు చెందిన ముంబై పోలీసులు రట్టు చేశారు. జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ కుమార్ ప్రేమ్ లాల్ ఆర్య (32) పలు హిందీ సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

మిత్రులు అజయ్ శర్మ, విజయ్ లతో కలిసి గత ఐదేళ్లుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

విటుల్లా పోలీసులు నవీన్ కు ఫోన్ చేసి అమ్మాయిలు కావాలంటూ ఆడిగారు. తాను సినీ పరిశ్రమకు చంెదిన ఇద్దరిని పంపిస్తున్నట్లు నవీన్ వారికి చెప్పారు. ఒక్కో మహిళకు రూ.60 వేలు చెల్లించాలని, హోటల్ ఖర్చులను కూడా భరించాలని చెప్పాడు. 

పోలీసు వలకు చిక్కిన నవీన్ అమ్మాయిలతో కలిసి హోటల్ కు వచ్చాడు. అలా నవీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు మహిళల వాంగ్మూలాలను నమోదు చేసుకుని వారిని హోంకు పంపించారు.