భార్యభర్తల బంధం చాలా గొప్పదని మన పూర్వీకులు చెబుతుండేవారు. ఏ బంధం శాశ్వతం కాకపోయినా... భార్యభర్తలు మాత్రం కడదాకా తోడుంటారని భావిస్తుంటారు. ఆ మేరకు పెళ్లి నాడు ప్రమాణాలు కూడా చేస్తుంటారు. అయితే....కాలం మారింది. ఈ మధ్యకాలంలో చిటికీమాటికీ...భార్యభర్తలు విడిపోతున్నారు. చిన్నిచిన్ని కారణాలకే కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. 

కొందరైతే... అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏడుఅడుగులు వేసిన బంధాన్ని చాలా సులభంగా వదిలేసుకుంటున్నారు. లేదంటే చంపేసి అడ్డు తొలగించుకుంటున్నారు. తాజాగా... ఓ భార్య..  చాలా చిన్న కారణంతో మూడుముళ్ల బంధాన్ని వదిలేసుకుంది. ప్రియుడితో పరారయ్యింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ లో చోటుచేసుకుంది.

అసలు మ్యాటరేంటంటే.... ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లా కాంపియర్ గంజ్ కు చెందిన ఓ మహిళకు కోడిగడ్డు అంటే చాలా ఇష్టమట. ఎప్పుడూ గుడ్డు తెమ్మని ఆమె భర్తని కోరుతూ ఉంటుందట. ఆమె భర్త ఎప్పుడైనా గుడ్డు తేకపోతే.. కచ్చితంగా గొడవ పెట్టుకునేది. ఇటీవల కూడా ఇలానే జరగడంతో... భర్తను వదిలేసి ప్రియుడితో పరారయ్యింది.

AlsoRead మండుతున్న చితిలో నుంచి తల బయటకు తీసి..

భార్య కనిపించడం లేదంటూ భర్త పోలీసులను ఆశ్రయించగా.... వారు ఆమె ఆచూకీ కనుగొన్నారు. భర్తను వదిలేసి ప్రియుడితో ఎందుకు లేచిపోయావని పోలీసులు ఆమెను ప్రశ్నించగా...ఆమె చెప్పిన సమాధానం అందరినీ విస్మయానికి గురిచేసింది.

తన భర్త రోజూ గుడ్డు తేవడం లేదని అందుకే వదిలేసాని చెప్పడం విశేషం. విచిత్రం ఏమిటంటే.... ఆమెకు గుడ్డు అంటే ఇష్టమున్న విషయాన్ని తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆమెకు రోజూ కోడిగుడ్లు ఇచ్చి దగ్గరయ్యాడు. కేవలం గుడ్డుకోసమే ఆమె భర్తను వదిలేసి ప్రియుడితో పరారవ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది. కాగా... ఆమెకు నచ్చజెప్పి.. భర్త దగ్గరకు పంపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.