ఆ జంట ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. తమ ప్రేమ విషయాన్ని ఇరు వైపుల పెద్దలకు తెలియజేశారు. వారు అంగీకరించడంతో పెళ్లి పీటలు ఎక్కారు. అయితే... వీళ్లు పెళ్లి పీటలు ఎక్కిన విధానం మాత్రం  చాలా వినూత్నంగా ఉంది. మరో నలుగురికి ఆదర్శంగానూ మారారు. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే...

ఒడిశా రాష్ట్రంలోని బైర్హంపూర్ నగరంలోని ఓ ప్రేమ జంట వినూత్నంగా వివాహం చేసుకున్నారు. బైర్హంపూర్ నగరానికి చెందిన విప్లవ్ కుమార్, అనితలు భారత రాజ్యంగంపై ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి చేసి ఆ వివాహానికి వచ్చిన అతిథులు కూడా షాకయ్యారు. అక్కడితో అయిపోలేదు. పెళ్లికి ముందు రక్తదానం చేసి.. ఆ తర్వాతే వాళ్లు పీటలు ఎక్కడం విశేషం.

also Read  భార్య, కుమార్తె లేచిపోయారని... పొరిగింటి మహిళను అడవిలోకి తీసుకెళ్లి...

వధూవరులైన విప్లవ్ కుమార్, అనితలతోపాటు పెళ్లికి వచ్చి అతిధులు కూడా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ‘‘ ప్రతి ఒక్కరూ వరకట్నం లేకుండా, హంగూ ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా పర్యావరణహితంగా వివాహం చేసుకోవాలి. పెళ్లి సందర్భంగా బాణసంచా కాల్చవద్దు. మ్యూజిక్ కూడా పెట్టవద్దు. ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయండి’’ అంటూ విప్లవ్ కుమార్ వ్యాఖ్యానించారు.వరుడు విప్లవ్ కుమార్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగి కాగా వధువు అనిత నర్సుగా పనిచేస్తున్నారు. వితంతువులు కూడా పాల్గొన్న తమ వినూత్న పెళ్లితో తామిద్దరం కొత్త జీవితం ప్రారంభించడం సంతోషాన్నిచ్చిందని విప్లవ్ కుమార్, అనితలు వ్యాఖ్యానించారు.