ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా లండన్‌లో తెలంగాణా ఐక్యవేదిక అఖిలపక్ష సమావేశం

ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా 6 ప్రధాన రాజకీయ పార్టీలు ఐక్యవేదికగా లండన్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. 

telangana ikya vedika hosts all party meeting for rtc strike

ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా 6 ప్రధాన రాజకీయ పార్టీలు ఐక్యవేదికగా లండన్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  టీజెస్  అధ్యక్షుడు కోదండ రాం,మల్కాజిగిరి  ఎంపీ  రేవంత్ రెడ్డి ,నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తమ సందేశాన్ని ఇచ్చారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు లండన్ ఎన్నారై ల మద్దతు స్ఫూర్తి తో అన్ని దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు మద్దతు ఇవ్వాలని కోరారు. విదేశాల్లో తెలంగాణ ఉద్యమం చేసిన ఎన్నారై లు తెలంగాణ లో కష్ట కాలం లో మౌనం వహించడం తప్పని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యమం చేసిన ఎన్నారై లు   సామాజిక బాధ్యతతో వారి అభిప్రాయాలూ చెప్పి ప్రభుత్వం పరిష్కార దిశగా చొరవ తీసుకునే విధంగా ఒత్తిడి తేవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. లండన్ తరహాలో అమెరికాలో వున్న ఎన్ఆర్ఐలు కూడా ఆర్టీసీ కి మద్దతు తెలపాలని కోరారు. ముఖ్యమంత్రి ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తే అనేక సమస్యలు పరిష్కరించ బడుతున్నాయన్నారు.  

Also read:విరమించాలని చెప్పలేం, పరిమితులుంటాయి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు

మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. నిర్బంధాలు , హౌస్ అరెస్టులు ఉద్యమ అణిచివేత తో సమస్య మరో సమస్య కి దారి తీస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి విడనాడాలని కోరారు .

టీజెస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పెద్ద మనుసు చేసుకొని కార్మికుల సమస్య పరిష్కార దిశా గా ఆలోచన చేయాలనీ డిమాండ్ చేశారు. పట్టు విడుపుల సమయం కాదని బలిదానాలు పెరగకుండా చర్యలు చేబట్టాలని ,అణిచివేత ధోరణి సమస్యకు పరిష్కారం కాదని అన్నారు.

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ  థేమ్స్ నది ఒడ్డున  లండన్ నుండి తెలంగాణ  ఉద్యమం  చేసిన ఎన్నారైలు ఆర్టీసీ కార్మికులకు మద్ధతు తెలపడం ధైర్మాన్ని ఇచ్చిందన్నారు. తమ సమస్యలు త్వరగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి ని అనేక ప్రయత్నాల ద్వారా విన్నవించుకున్న తర్వాతే సమ్మె చేస్తున్నామని అశ్వత్థామరెడ్డి తెలిపారు.

Also read:మా పరిధిలో ఉందా, లేదా చూస్తాం: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు

నాడు తెలంగాణ ఉద్యమం లో  థేమ్స్ నది ఒడ్డున  బ్రిటన్ పార్లమెంట్ ముందు ధర్నా చేసి  కెసిఆర్‌కి బాసటగా నిలిచామని..  కానీ నేడు కేసీఆర్ విధానాలపై మరోసారి ధర్నాలు చేయాల్సి రావడం దురదృష్టకరమని ఎన్నారైలు తెలిపారు.

ఆత్మహత్యలు ఆపాలని ,ముఖమంత్రి ఆత్మహత్యలపై స్పందించాలని  చనిపోయిన కుటుంబానికి 15 లక్షల ఆర్ధిక సహాయం ,కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు .. ఆంధ్రప్రదేశ్ తరహా తెలంగాణ లో కార్మికుల్ని ప్రభుత్వము లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ మలి ఉద్యమం లో  పాల్గొన్న గంప వేణుగోపాల్ ,  పసునూరి కిరణ్ , రంగు వెంకటేశ్వర్లు శ్రీధర్ నీల ల ఆధ్వర్యం లో  6 ప్రధాన  రాజకీయ పార్టీ లు ,మేధావులు ఐక్య వేదిక గ ఏర్పడి సభ ఏర్పాటుకు ముఖ్య భూమిక పోషించారు.

కాంగ్రెస్ పార్టీ తరపున  శ్రీ గంప వేణుగోపాల్ , శ్రీ గంగసాని ప్రవీణ్ రెడ్డి ,శ్రీ శ్రీధర్ నీలా ,శ్రీ శ్రీనివాస్  దేవులపల్లి ,శ్రీ నర్సింహా రెడ్డి తిరుపరి ,శ్రీమతి మేరీ ,శ్రీ జవహార్ రెడ్డి,శ్రీ జయంత్ వద్దిరాజులు, బీజేపీ తరపున పసునూరి కిరణ్ ,ప్రవీణ్ బిట్ల తదితరులు పాల్గొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios