తెలుగు విద్యార్ధుల అవస్థలు: కేసీఆర్ కూపన్స్ ద్వారా ఆదుకున్న టీఆర్ఎస్ లండన్ విభాగం

లండన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను ఎన్నారై టీఆర్ఎస్ యూకే విభాగం ఆదుకుంటోంది. తెలుగు రాష్ట్రాల నుండి బ్రిటన్‌కు గతేడాది వెయ్యిమంది విద్యార్ధులు ఉన్నత విద్య కోసం వచ్చారు.

NRI TRS UK distributes kcr coupons to telugu students in london

గత కొన్ని వారాలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే, దీని వలన ప్రజలు ఆరోగ్యపరంగానే కాకుండా, నిత్యావసరాల పరంగా, ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు వీలైనంత సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో లండన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్ధులను ఎన్నారై టీఆర్ఎస్ యూకే విభాగం ఆదుకుంటోంది.

తెలుగు రాష్ట్రాల నుండి బ్రిటన్‌కు గతేడాది వెయ్యిమంది విద్యార్ధులు ఉన్నత విద్య కోసం వచ్చారు.  కరోనా మహమ్మారి వల్ల ఇక్కడ విద్యార్థులు వివిధ రకాలుగా ఇబ్బంది పడుతున్నారని, వారికి ఎన్నారై తెరాస యూకే విభాగం వీలైనంత సహాయం చేస్తూ అండగా ఉంటోందని ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల తెలిపారు.

Aslo Read:వారితో కలిసి భోజనం చేసిన మంత్రి సత్యవతి రాథోడ్

టి.ఆర్.యస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలకు దూరంగా ఉంటూ " కెసిఆర్ కూపన్స్ " పేరుతో సామాజిక దూరాన్ని పాటిస్తూ... సుమారు 200 లకు పైగా విద్యార్థులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.

వీరందరూ స్థానిక దుకాణాల్లోనే సరకులను తీసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు అశోక్ వెల్లడించారు. అలాగే మరొక్కసారి కూపన్ ఆవిష్కరించి ప్రోత్సహించిన ఎంపీ సంతోష్ కుమార్‌కు అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.

 

NRI TRS UK distributes kcr coupons to telugu students in london

 

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రవాసులకు సాయం చేస్తున్నామని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం వెల్లడించారు.

ఎన్నారై తెరాస యూకే సభ్యులు గత నెల రోజుల నుండి స్థానికంగా నే కాకుండా క్షేత్రస్థాయిలో ఎంతోమందికి నిత్యావసరాలు అందించారని సలహా మండలి వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.

Also Read:టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

యూకే లో నివసిస్తున్న ప్రవాస తెలంగాణ వారికి ఏదైనా సహాయం కావాలంటే మమ్మల్ని nritrs@gmail.com ద్వారా సంప్రదించవచ్చని చంద్రశేఖర్ సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దేశానికే ఆదర్శమయ్యే రీతిలో ప్రజలను కరోనా నుంచి కంటికి రెప్పలా కాపాడుతున్నారని ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్ధులకు నిత్యావసర సరకులను అందించేందుకు సహకరించిన అనిల్ కూర్మాచలం, సిక్కా చంద్రశేఖర్ గౌడ్, నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, సతీష్ గొట్టెముక్కల, రమేష్ ఈసెంపల్లి, హరి నవాపేట్, సురేష్ గోపతి,శివ గౌడ్ , రవి ప్రదీప్ పులుసు, సృజన రెడ్డి చాడ తదితరులకు అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios