ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం పాలయ్యాడు. కడప జిల్లా మాధవరం గ్రామానికి చెందిన శ్రీహరి ఎంబీబీఎస్ చదివేందుకు గాను ఫిలిప్పీన్స్ వెళ్లాడు.

ఈ క్రమంలో అక్కడ జరిగిన ఓ కారు ప్రమాదంలో శ్రీహరి మరణించాడు. అతని మరణవార్తను మిత్రులు శ్రీహరి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

విద్యార్ధి భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకువచ్చే ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాల్సిందిగా కుటుంబసభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

Also Read:

రేప్ చేస్తానంటూ ఎఫ్‌బీలో బెదిరింపులు: దుబాయ్‌లో భారతీయుడికి అరెస్ట్ ముప్పు

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు తెలుగు ఎన్ఆర్ఐలు దుర్మరణం

గ్రాసరీ స్టోర్ లో కాల్పులు.. ఎన్ఆర్ఐ మృతి