గ్రాస్టరీ స్టోర్ లో ఓ అంగతకుడు జరిపిన కాల్పుల్లో ఓ భారతీయుడు మృతి చెందాడు. ఈ సంఘటన అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో చోటుచేసుకుంది. అక్కడి కాలమానం ప్రకారం శనివారం ఉదయం  గ్రాసరీ స్టోర్ లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులు జరిపాడు. ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చి మరీ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో భారత్ కి చెందిన మణీందర్ సింగ్ సాహి(31) ప్రాణాలు కోల్పోయాడు. ఆరునెలల క్రితమే మణీందర్ సింగ్ అమెరికా వచ్చాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు  ఉన్నారు. ఆరు నెలల క్రితం అమెరికా వచ్చిన సాహి.. ఇక్కడ లాస్ ఎంజిల్స్ లో గ్రాసరీ స్టోర్ లో పనిచేస్తున్నాడు.

Also Read 68 వేల మంది భారతీయులకు హెచ్1బీ గండం : దొరికితే అమెరికాలోనే.. లేదంటే ఇంటికే..

కాగా... ఇక్కడ తాను కష్టపడిన దానితోనే అతని కుటుంబం జీవిస్తోంది. ప్రతినెలా భారత్ లో ఉన్న భార్య, పిల్లలకు డబ్బులు పంపేవాడని అతని బంధువులు చెబుతున్నారు. 

కాగా దుండగులు దొంగతనానికి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని వద్ద ఉన్న హ్యాండ్ గన్ తో కాల్పులు జరిపడంతో సాహి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా... ప్రమాదం జరిగిన సమయంలో గ్రాసరీ స్టోర్ లో ఇద్దరు కస్టమర్లు కూడా ఉన్నారని.. అయితే వాళ్లకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదని చెబుతున్నారు. కాగా.. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా... మణీందర్ సింగ్ సాహి మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు చోటుచేసుకున్నాయి.