రేప్ చేస్తానంటూ ఎఫ్‌బీలో బెదిరింపులు: దుబాయ్‌లో భారతీయుడికి అరెస్ట్ ముప్పు
ఆన్‌లైన్‌లో ఓ భారతీయ మహిళపై అసభ్యంగా దూషించడంతో పాటు అత్యాచారం చేస్తానంటూ బెదిరించిన ఆరోపణలపై దుబాయ్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న భారతీయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని అక్కడి మహిళలు ఆందోళనకు దిగారు
ఆన్‌లైన్‌లో ఓ భారతీయ మహిళపై అసభ్యంగా దూషించడంతో పాటు అత్యాచారం చేస్తానంటూ బెదిరించిన ఆరోపణలపై దుబాయ్‌లో చెఫ్‌గా పనిచేస్తున్న భారతీయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని అక్కడి మహిళలు ఆందోళనకు దిగారు.
చెఫ్ త్రిలోక్ సింగ్‌ను అరెస్ట్ చేయాలంటూ వందలాది మంది మహిళలు డిమాండ్ చేస్తున్నట్లు గల్ఫ్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. త్రిలోక్ ఓ ఫేస్‌బుక్ పోస్టులో మహిళను అత్యాచారం చేస్తానని బెదిరించాడు.
ప్రస్తుతం త్రిలోక్ ఫేస్‌బుక్ ఖాతా డిలీట్ అయినప్పటికీ.. అతని ప్రోఫైల్‌కు సంబంధించిన స్క్రీన్ షీట్లు మాత్రం యూఏఈకి వెళ్లేముందు ఢిల్లీలోని లలిత్ హోటల్‌లో చెఫ్‌గా పనిచేసినట్లు చూపిస్తున్నాయి.
Also Read:అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు తెలుగు ఎన్ఆర్ఐలు దుర్మరణం
త్రిలోక్ సింగ్ యూఏఈలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో తెలియరాలేదు. అయితే దుబాయ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో అతను పనిచేస్తున్నట్లు ఎఫ్‌బీ ప్రొఫైల్ పేర్కొంది. ఇదే సమయంలో త్రిలోక్‌పై ఈ-క్రైమ్ పోర్ట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని సోషల్ మీడియాలో సలహా ఇచ్చింది.
సోషల్ మీడియాలో అసభ్యకరమైన సందేశాలను పోస్ట్ చేసే వారిని యూఏఈ సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం విచారించవచ్చు. ఇందుకు గాను నిందితుడికి జైలు శిక్ష లేదా 50 వేల నుంచి 3 మిలియన్ డాలర్ల జరిమానాలను విధించవచ్చు.
గతేడాది న్యూజిలాండ్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను సెలబ్రేట్ చేసుకుంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన ఓ భారతీయుడిని దుబాయ్‌లోని ట్రాన్స్‌గార్డ్ గ్రూప్ విధుల్లోంచి తొలగించింది.
Also Read:గ్రాసరీ స్టోర్ లో కాల్పులు.. ఎన్ఆర్ఐ మృతి
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను చంపేస్తామని బెదిరిస్తూ, ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన ఓ సూపర్‌వైజర్‌ను అబుదాబీలో ఉద్యోగం నుంచి తప్పించారు. 2017లో ఓ భారతీయ జర్నలిస్ట్‌కు ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర సందేశాలపు పంపినందుకు గాను మరో కేరళ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించారు.