Asianet News TeluguAsianet News Telugu

బ్రిటన్ ఫైనాన్స్‌ మినిస్టర్‌గా...ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు..?

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో భారత సంతతి ఎంపీకి కీలక ఫోర్ట్‌పోలియో దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి అల్లు రిషి సునక్.

infosys Narayana Murthys Son in law Rishi Sunak Tipped to Run Britain Economic Super ministry
Author
London, First Published Dec 26, 2019, 1:53 PM IST

వివిధ దేశాల్లో వృత్తి వ్యాపార రీత్యా స్థిరపడిన భారతీయులు ఆయా దేశాల రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు. అమెరికాతో పాటు బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారత సంతతి రాజకీయవేత్తలు విజయవంతంగా దూసుకెళ్తున్నారు. 

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో భారత సంతతి ఎంపీకి కీలక ఫోర్ట్‌పోలియో దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఎవరో కాదు భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి అల్లు రిషి సునక్.

Also read:దుబాయ్ లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు భారత విద్యార్థుల మృతి

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషిక్ కన్జర్వేటివ్ పార్టీ  అభ్యర్ధిగా యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్ నుంచి గెలుపొందారు. బోరిస్ గత కేబినెట్‌లో ఉప ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సునక్ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనపై ప్రధాని జాన్స్‌కు మంచి అభిప్రాయం ఉండటంతో పాటు సన్నిహితుడిగా పార్టీలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. 

పార్లమెంట్ ఎన్నికల సమయంలో టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ లక్ష్యాలను.. అధికారంలోకి వస్తే తాము చేయబోయే కార్యక్రమాలను తెలిపారు. వచ్చే ఏడాది బ్రెగ్జిట్ వంటి కీలక పరిణామాలు ఉండటంతో అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టిపెట్టిన బోరిస్‌.. రిషి సునక్ సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో ప్రధాని జాన్సన్ బోరిస్ మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. 

Also Read:బ్రిటన్‌ పార్లమెంట్‌లో భగవద్గీతపై ప్రమాణం

సునక్ హాంప్‌షైర్ కౌంటీలో జన్మించి, స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. ఇదే సమయంలో తన తోటి విద్యార్ధిని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. రిచ్‌మాండ్ నుంచి వరుసగా మూడోసారి ఎన్నికైన సునక్.. గతంలో థెరిసా మే కేబినెట్‌లోనూ మంత్రిగా పనిచేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios