దుబాయ్: పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ పర్వదినం రోజు బుధవారం తెల్లవారు జామున దుబాయ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. 

ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం... క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏర్పాటైన ఓ విందుకు హాజరై తిరిగి వస్తుండగా రోహిత్ కృష్ణకుమార్ (19), శరత్ కుమార్ (21) ప్రమాదానికి గురయ్యారు. వారిద్దరు కూడా కేరళకు చెందినవారు. 

రోడ్డు ప్రమాదంలో ఇరువురు అక్కడికక్కడే మరణిం్చారు. కృష్ణకుమార్ యుకేలో ఉన్నత విద్యను అభ్యసిస్తుండగా, శరత్ కుమార్ అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు.

సెలవులు కావడంతో ఇరువురు కూడా దుబాయ్ లోని తమ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చారు. వారిద్దరు దుబాయ్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివినట్లు గల్ఫ్ న్యూస్ తెలియజేసింది.