విద్య, ఉపాధి కోసం దేశ విదేశాల్లో స్థిరపడిన భారతీయులు.. పరాయి గడ్డపై ఉన్నప్పటికీ భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను మాత్రం మరచిపోవడం లేదు. తాజాగా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన భారత సంతతి ఎంపీలు హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేశారు.

Also Read:బిచ్‌లో వేలాది పురుషాంగాలు!.. వాటిని చూసి..

మంగళవారం పార్లమెంట్ దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్‌లో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీకి సమీపంలోని ఆగ్రాలో జన్మించిన ఆలోక్ వర్మ, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ప్రమాణ స్వీకారం సందర్భంగా చేతిలో భగవద్గీతను పట్టుకున్నారు.

సభ్యులు తమకు నచ్చిన పవిత్ర గ్రంథంపై ప్రమాణం చేసే వెసులుబాటు బ్రిటన్‌లో ఉంది. లేని పక్షంలో ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. తాజా ఎన్నికల్లో బ్రిటన్ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో 65 మంది శ్వేతజాతీయేతరులు విజయం సాధించారు.

Also Read:Pervez Musharraf :పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్‌కు ఉరిశిక్ష

వీరిలో 15 మంది భారత సంతతికి చెందిన వారే. రిషి సునక్ గత ప్రభుత్వంలో ట్రెజరీ డిపార్ట్‌మెంట్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. 39 ఏళ్ల రిషి.. ఇంగ్లాండ్‌లో హాంప్‌షైర్‌ కౌంటీలో జన్మించారు. యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్ నుంచి ఎంపీగా మూడోసారి ఎన్నికయ్యారు.

గతంలో థెరిసా మే ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. తన తోటి విద్యార్ధిని నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆలోక్ శర్మ ఆగ్రాలో పుట్టి.. బ్రిటన్‌లో స్థిరపడ్డారు.