అనుమానం పెనుభూతంగా మారి ఓ వ్యక్తి ప్రియురాలిని దారుణంగా హత్య చేసి ఆమె మృతదేహంతో ప్రయాణం చేశాడు. వివరాల్లోకి వెళితే.. భారతదేశానికి చెందిన 27 ఏళ్ల యువకుడు యూఏఈలో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మనదేశానికే చెందిన ఓ యువతితో అతను ప్రేమలో పడ్డాడు.

కొన్ని రోజుల పాటు సంతోషంగా సాగిన వీరి ప్రేమాయణంలో అనుమానం చిచ్చు పెట్టింది. తనను కాదని ప్రియురాలు మరో వ్యక్తితో మాట్లాడుతోందని యువకుడు అనుమానం పెంచుకున్నాడు. అప్పటి నుంచి తరచూ ఆమెతో గొడవకు పడేవాడు.

Also Read:మహిళకు వేధింపులు... రష్మిక మాజీ ప్రియుడి హిట్ సినిమా డిస్ట్రిబ్యూటర్ అరెస్ట్

ఈ నేపథ్యంలో కారులో తన ప్రియురాలిని తీసుకెళ్లి సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ సమస్య పరిష్కారం కాకపోగా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ సమయంలో కోపంతో ఊగిపోయిన యువకుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కోశాడు.

శవాన్ని కారులో ముందు సీట్లో తన డ్రైవింగ్ సీటు పక్కనే పెట్టుకుని 45 నిమిషాల పాటు ప్రయాణం చేశాడు. ఓ హోటల్ వద్ద భోజనం చేసి, అనంతరం డైరాలోని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

గతేడాది జూలైలో జరిగిన ఈ కేసును విచారించిన న్యాయస్థానం త్వరలో శిక్షను ఖరారు చేయనుంది. ఈ కేసుపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ... ఆ యువకుడు రక్తం నిండిన దుస్తులతో స్టేషన్‌కు వచ్చాడని, ఆ సమయంలో అతనిని చూసి తాను షాకయ్యానని చెప్పాడు.

Also Read:మైనర్ తో భారత విద్యార్థి కామవాంఛ: అమెరికాలో కఠిన శిక్ష

తన ప్రియురాలిని తాను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. అతనిని అదుపులోకి తీసుకుని కారులో ఉన్న యువతి మృతదేహాన్ని, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఆ అధికారి వెల్లడించాడు. అదే విధంగా బాధితురాలిని చంపేస్తానని హత్యకు ముందే ఆమె కుటుంబసభ్యులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు తాము గుర్తించామని ఆయన పేర్కొన్నారు.