వివాహితను వేధించిన కేసులో ఓ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆస్ట్రేలియా లొని మెల్ బోర్న్ లో చోటుచేసుకోగా... సదరు ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ భారతీయుడు కావడం గమనార్హం. అది కూడా దక్షిణ భారత సినిమాలను మాత్రమే అతను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... భారత సంతతికి చెందిన రూపేష్(39) ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. అతను కన్నడ సూపర్ హిట్ సినిమాలు రంగితరంగ, అవనే శ్రీమన్నారాయణ( తెలుగులో అతడే శ్రీమన్నారాయణ). ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. కాగా... వీటితో పాటు రూపేష్  ఇతర భాషల్లోనూ పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. 

Also Read కరోనా భయం... భక్తులకు మాతా అమృతానందమయి దర్శనం బంద్...

కాగా..సదరు డిస్ట్రిబ్యూటర్ పై ఓ వివాహిత ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రూపేష్ కి కొంతకాలం క్రితం మెల్ బోర్న్ లో ఉండే ఓ వివాహిత పరిచయమైంది. ఆ పరిచయాన్ని స్నేహంగా మార్చాడు. ఆ తర్వాత ఆమెకు డ్రింక్ ఆఫర్  ఛేసి.. బలవంతంగా హుక్కా తీసుకునేలా చేశాడు. ఆమె అలా హుక్కా తీసుకుంటుండగా ఫోటోలు తీశాడు.

అనంతరం ఆ ఫోటోలను ఆమెకు చూపించి.. వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చకుంటే.. ఆ ఫోటోలను అందరికీ చూపిస్తానంటూ ఆమెను బెదిరించాడు. అక్కడితో ఆగకుండా రూ.5లక్షలు నగదు ఇవ్వాలంటూ ఆమెను ఇబ్బంది పెట్టాడు. 

సదరు మహిళ భర్త, పిల్లలు ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లి తన శారీరక కోరిక తీర్చమంటూ వేధించేవాడు. అతని ఆగడాలు ప్రతి రోజూ ఎక్కువౌతుండటంతో.. సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూపేష్ ని అరెస్ట్ చేశారు.