ప్రముఖ టెలికాం సంస్థ జియో.. మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో కస్టమర్లకు మరో కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్ ని అందజేస్తోంది. జియో  ఇటీవల ‘‘సర్ ప్రైజ్ క్యాష్ బ్యాక్’’ ఆఫర్ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. కాగా.. ఈ ఆఫర్ సోమవారంతో ముగిసింది. దీంతో.. మరో ఆఫర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. రూ.398 లేదా అంతకు మించి రీఛార్జ్ లు చేసుకుంటే వారికి 100శాతానికి పైగా క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు చెప్పింది. రిలయన్స్‌ జియో వెబ్‌సైట్‌ ప్రకారం '100 శాతానికి పైగా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌' జియో ప్రైమ్‌ మెంబర్లకు అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. 2018 జనవరి 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంచనున్నట్టు జియో వెబ్‌సైట్‌ పేర్కొంది. రెండు విధాలుగా యూజర్లు 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందనున్నారు. ఒకటి జియో టారిఫ్‌ ప్లాన్‌ రీఛార్జ్‌, రెండు డిజిటల్‌ వాలెట్ల రీఛార్జ్‌ ల ద్వారా ఈ క్యాష్‌బ్యాక్‌ యూజర్లకు లభిస్తుంది. 
 

మొదటి దానికొస్తే..రూ.398, లేదా ఆపై మొత్తాల ప్రతి రీఛార్జ్‌ పై తన ప్రైమ్‌ మెంబర్లకు జియో 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను గ్యారెంటీ ఇస్తోంది.  ప్రతి రీఛార్జ్‌ పై రూ.400  విలువైన క్యాష్‌బ్యాక్‌ను, రూ.50 విలువచేసే ఎనిమిది ఓచర్ల రూపంలో అందిస్తుంది. ఇవి కస్టమర్ల అకౌంట్‌లోకి వెంటనే క్రెడిట్‌ అవుతాయి. మైజియో యాప్‌లో మై ఓచర్లలో ఇవి కనిపిస్తాయి.
ఇక రెండోది.. జియో ఇటీవల దిగ్గజ డిజిటల్‌ వాలెట్లతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఫ్రీఛార్జ్‌, మొబిక్విక్‌, పేటీఎం, అమెజాన్‌ పే, ఫోన్‌పే, భీమ్‌, యాక్సిస్‌పే ద్వారా పేమెంట్‌ చేసిన జియో ప్రైమ్‌ మెంబర్లకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ కింద రూ.300 వరకు అందిస్తుంది. అంటే మొత్తంగా 700 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ జియోప్రైమ్‌ మెంబర్లకు ఆఫర్‌ చేస్తుంది.