1-6: 2.3 కోట్ల స్మార్ట్ ఫోన్ల పాస్ వర్డ్ ఇదే! 9అంకెలు కూడా..

అంతర్జాతీయంగా స్మార్ట్ ఫోన్ల వినియోగంతోపాటు పాస్‌వర్డ్‌ల వినియోగం పెరుగుతోంది. దాదాపు 2.30 కోట్ల మంది 123456 అనే నంబర్‌ను పాస్ వర్డ్‌గా వాడుతున్నారని యునైటెడ్ కింగ్ డమ్‌కు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ నిర్వహించిన అధ్యయనం తేల్చింది.

Millions in this digital world still use '123456' as their password

లండన్‌: స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులంతా ఏదో ఒక నెంబర్‌ను తమ పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటారు. అదే విధంగా ఆన్‌లైన్‌ వేదికగా లావాదేవీలు నిర్వహించాలన్నా పాస్‌వర్డ్‌ తప్పనిసరి.  ఇప్పటికీ లక్షలమంది ప్రజలు అత్యంత సులువైన, అందరూ గుర్తించే పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటున్నారని తేలింది. 

ఇందులో ఎక్కువమంది ‘123456’ నంబర్‌ను తమ పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నట్లు తాజాగా యునైటెడ్ కింగ్ డమ్‌కు చెందిన నేషనల్‌ సైబర్‌ సెక్యురిటీ సెంటర్‌(ఎన్‌సీఎస్‌సీ) చేసిన అధ్యయనంలో ఈ సంగతి బయటపడింది. ప్రజలు తమకు ఎక్కువగా గుర్తుండే అంకెలనే పాస్‌వర్డ్‌గా పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎన్‌సీఎస్‌సీ తెలిపింది.

ప్రజలు ఎక్కువగా వినియోగించే అంకెలను, పదాలను ఎన్‌సీఎస్‌సీ విశ్లేషించింది. వీటిలో దాదాపు 2.30కోట్ల మంది ‘123456’ అంకెను తమ పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారట. ఆ తర్వాత అత్యధికమంది కంప్యూటర్‌ కీబోర్డ్‌ లేదా, మొబైల్‌ ఫోన్‌ కీ ప్యాడ్‌లోని మొత్తం అంకెలు ‘123456789’ను పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారని ఎన్‌సీఎస్‌సీ తెలిపింది. 

మరికొంతమంది తమ పాస్‌వర్డ్‌గా ‘qwerty’ ఆంగ్ల అక్షరాలను పెట్టుకోగా, ఇంకొంతమంది ‘password’ అనే పదాన్ని, మరికొంత మంది ‘1111111’ అంకెను పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారు. ఇక యష్లీ, మైఖేల్‌, డానియల్‌, జెస్సికా, చార్లీ పేర్లు ఎక్కువమంది పాస్‌వర్డ్‌లుగా వాడుతున్నారు. 

 

చదవండి: ఒక ఫోన్ బాలేదంటే.. 10 పిక్సెల్3 ఫోన్లు పంపిన గూగుల్!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios