Asianet News TeluguAsianet News Telugu

ఒక ఫోన్ బాలేదంటే.. 10 పిక్సెల్3 ఫోన్లు పంపిన గూగుల్!

ఓ కస్టమర్ తాను కొనుగోలు చేసిన గూగుల్ పిక్సెల్ 3లో లోపాలున్నాయని, సరిగా పనిచేయడం లేదని, ఈ ఫోన్ తీసుకుని తన డబ్బులు తనకు తిరిగివ్వాలని గూగుల్‌ను కోరాడు. అయితే, గూగుల్ మాత్రం ఏకంగా $9,000 (సుమారు రూ. 6,17,900) విలువైన 10 పిక్సెల్ 3 ఫోన్లను అతనికి పంపించింది. 

Google Gives Pixel 3 Owner 10 Replacement Phones Instead of   Refund: Report
Author
New Delhi, First Published Apr 20, 2019, 10:54 AM IST

గూగుల్ ఫోన్ తయారీ సంస్థ చేసిన పనికి ఓ వినియోగదారుడు ఆనందం, ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఎందుకంటే.. తాను కొనుగోలు చేసిన గూగుల్ పిక్సెల్ 3లో లోపాలున్నాయని, సరిగా పనిచేయడం లేదని, ఈ ఫోన్ తీసుకుని తన డబ్బులు తనకు తిరిగివ్వాలని గూగుల్‌ను కోరాడు.

లేదంటే మరో కొత్త ఫోన్ రిప్లేస్ చేయాలని విన్నవించాడు. అయితే, గూగుల్ మాత్రం ఊహించని పనిచేసింది. ఏకంగా $9,000 (సుమారు రూ. 6,17,900) విలువైన 10 పిక్సెల్ 3 ఫోన్లను అతనికి పంపించింది. దీంతో అతడు ఆశ్చర్యపోయాడు. 

అయితే, ఆ తర్వాత తనకు కావాల్సిన ఒక ఫోన్ ఉంచేసుకుని, మిగితావి తిరిగి పంపించేద్దామని అనుకున్నాడు. అయితే, గూగుల్ తనకు ఇవ్వాల్సిన మొత్తం రిఫండ్ చేసిన తర్వాతే ఆ పనిచేస్తానంటూ చెప్పుకొచ్చాడు చీతోజ్ అనే ఆ కస్టమర్. 

రూ. 56,989 విలువ గల పిక్సెల్ 3లో లోపం ఉండటంతో తాను ఆ ఫోన్‌ను రిటర్న్ చేసినట్లు చీతోజ్ తెలిపారు. అయితే, గూగుల్ అతనికి ఎలాంటి రిఫండ్ చేయలేదు. అందుకు బదులుగా 10 పిక్సెల్స్ ఫోన్లను పంపిందని ది ఆండ్రాయిడ్ పోలీస్ పేర్కొంది.

లోపాలు గల ఫోన్‌కు బదులు గూగుల్ తనకు టాక్స్ కింద 80డాలర్లను మాత్రమే రిటర్న్ చేసిందని, అయితే దీంతోపాటు 10 పిక్సెల్ 3 పోన్లు కూడా పంపిందని చీతోజ్ తెలిపాడు. ఈ ఫోన్లకు సంబంధించి తనను ఎలాంటి డబ్బులు కూడా కోరలేదని రెడిట్‌లో వెల్లడించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios