Asianet News TeluguAsianet News Telugu

విపణిలోకి మారుతి మినీ ఎస్‌యూవీ ‘ఎస్-ప్రెస్సో’

మారుతి సుజుకి ఎస్‌యూవీ విభాగంలో పోటీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నది. ఎస్-ప్రెస్సో పేరిట విడుదల చేసిన మారుతి సుజుకికి మంగళవారం విడుదల కానున్న రెనాల్ట్ ‘క్విడ్’ క్లైంబర్ గట్టి పోటీ ఇవ్వనున్నదని భావిస్తున్నారు.

Maruti Suzuki S-Presso: Price, variants, engine, dimensions, mileage explained
Author
Hyderabad, First Published Oct 1, 2019, 1:02 PM IST

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఎస్‌యూవీ విభాగంలో పోటీని మరింత పెంచే దిశగా అడుగులేస్తున్నది. సరికొత్త ఎస్‌యూవీ ఎస్-ప్రెస్సోను అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల మధ్యలో లభించనున్నది.

కంపెనీకి చెందిన ఐదో జనరేషన్ హర్టేక్ట్ ప్లాట్‌ఫాం కింద తయారైన ఈ కారు బీఎస్-6 ప్రమాణాలతో ఒక్క లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారు చేసింది సంస్థ. కంపెనీ ఎరీనా రిటైల్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఎస్‌-ప్రెస్సోను విక్రయిస్తారు. ఈ కారులో వర్ధమాన, గ్లోబల్‌ టెక్నాలజీని దేశీయ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చారు.

లీటర్ పెట్రోల్‌కు 21.7 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాల చెప్పాయి. మాన్యువల్, ఆటో గేర్‌షిఫ్ట్ (ఏజీఎస్) ట్రాన్స్‌మిషన్ కల రకాన్ని ఎంచుకునే సౌలభ్యం కొనుగోలుదారులకు కంపెనీ కల్పించింది. దేశవ్యాప్తంగా తొలిసారి కారు కొనుగోలు చేసే వారు కాంప్యాక్ట్ కారుకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని మారుతి సుజుకి సీఈఓ కం ఎండీ కెనిచి అయుకవా తెలిపారు.

ఇదే సమయంలో యువతీయువకులు కూడా ఎంట్రి లెవల్ కాంప్యాక్ట్ సెగ్మెంట్‌లో ఉన్న కార్లను కొనుగోలు చేస్తున్నారని, వీరిని దృష్టిలో పెట్టుకొని ఈ ఎస్-ప్రెస్సోను డిజైన్ చేసినట్లు మారుతి ఎండీ, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు.

ఈ కారును లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, ఆసియాన్‌ దేశాలకు వచ్చే 3 నుంచి 6 నెలల్లో ఎగుమతి చేయనున్నారు. ఈ కారులో 98 శాతం స్థానిక విడిభాగాలను వినియోగించారు. ఈ కారు అభివృద్ధి కోసం మారుతీ రూ.640 కోట్ల పెట్టుబడి పెట్టింది.

డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ర్టానిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ర్టిబ్యూషన్‌ (ఈబీడీ)తో కూడిన ఏబీఎస్‌ (యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌), లిమిటర్స్‌, రియర్‌ పార్కింగ్‌ అసిస్ట్‌ సిస్టమ్‌, హై స్పీడ్‌ వార్నింగ్‌ అలర్ట్‌, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌ వంటి భద్రతా ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

కాంపాక్ట్‌ అనేది భారతీయ కస్టమర్ల సహజ ఎంపికని, ఈ నేపథ్యంలో ఎంట్రీ లెవల్‌ కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లో సరికొత్త డిజైన్‌తో కారును తెచ్చామని ఎస్‌-ప్రెస్కో విడుదల సందర్భంగా మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కెనిచీ అయుకవా తెలిపారు. ఈ సెగ్మెంట్లో ఇప్పటి వరకు ఇలాంటి కారు రాలేదన్నారు. ఇది నేటి తరం యువత కోరికలు, మక్కువకు అనుసంధానం అవుతుందని చెప్పారు.

కార్ల మార్కెట్లో నెలకొన్న మందగమనం తాత్కాలిక పరిణామమేనని మారుతి సుజుకి సీఈఓ కెనిచి అయుకవా అన్నారు. భారత్‌ దీర్ఘకాలిక వృద్ధి పై తమకు విశ్వాసం ఉందన్నారు. ఎస్‌-ప్రెస్సో ద్వారా మార్కెట్లో సెంటిమెంట్‌ మారేందుకు దోహదపడుతుందని చెప్పారు. ఈ పండగల సీజన్‌తో మళ్లీ పరిశ్రమ వృద్ధి బాటలో పయనించే అవకాశం ఉందన్నారు.

ఎస్‌-ప్రెస్సోతో కలిపి ఎనిమిది మోడళ్లు బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని మారుతి సుజుకి సీఈఓ కెనిచి అయుకవా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంకన్నా ద్వితీయార్ధంలో కార్ల అమ్మకాలు మెరుగ్గా ఉంటాయన్న ఆశాభావంతో ఉన్నామని ఆయన తెలిపారు

కొనుగోలు సెంటిమెంట్‌ మెరుగుపడిందని, జీఎస్టీ రేట్ల విషయంలోనూ స్పష్టత వచ్చిందని మారుతి సుజుకి సీఈఓ కెనిచి అయుకవా అన్నారు. ఖరీఫ్‌ పంటలు బాగుంటాయన్న అంచనాలతో అమ్మకాలపై ఆశాభావం పెరుగుతోందని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios