Asianet News TeluguAsianet News Telugu

ఇక ‘ఓమ్నీ’ది ఒడిసిన కథే.. మారుతి మల్టీ పర్పస్ ‘ఎకో’

మార్కెట్లోకి వచ్చి 35 ఏళ్లైనా ఇప్పటికీ ఓమ్ని వ్యాన్స్‌కి ఆదరణేమీ తగ్గలేదు. అమ్మకాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వాహనాల భద్రతా/కాలుష్య ప్రమాణాల పరిరక్షణ కోసం కొంగొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నది. 

Maruti Suzuki Discontinues Omni Van After 35 Years of Service - Report
Author
Mumbai, First Published Apr 6, 2019, 3:26 PM IST

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’లో ఇక నుంచి మల్టీ పర్పస్ వెహికల్ గా ఇటీవల విపణిలో అడుగు పెట్టిన ‘ఏకో’ను ఆవిష్కరించింది. ఇప్పటివరకు సుమారు 35 ఏళ్ల పాటు చౌక మల్టీపర్పస్‌ వాహనంగా (ఎంపీవీ) వాహనదారులకు చేరువైన ఓమ్ని వ్యాన్‌ ఇకపై కనుమరుగు కానుంది. ఓమ్ని తయారీని నిలిపివేయాలని ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

వాహనదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎలా కావాలంటే అలా మార్చుకునేందుకు ఓమ్ని చాలా అనువుగా ఉంటోందని తెలిసిందే. మార్కెట్లోకి వచ్చి 35 ఏళ్లైనా ఇప్పటికీ ఓమ్ని వ్యాన్స్‌కి ఆదరణేమీ తగ్గలేదు. అమ్మకాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వాహనాల భద్రతా/కాలుష్య ప్రమాణాల పరిరక్షణ కోసం కొంగొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నది. ఇతర సంస్థల నుంచి పోటీ పెరుగడం, మరోవైపు అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటంతో చివరకు ఉత్పత్తిని నిలిపివేయాలని సంస్థ నిర్ణయించింది. 

ఈ నేపథ్యంలో ఓమ్ని వ్యాన్‌ తయారీ నిలిపివేయాలని మారుతీ నిర్ణయించుకున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. తమ తొలి కారు 800ను ప్రవేశపెట్టిన ఏడాది తర్వాత 1984లో ఓమ్ని వ్యాన్‌ను మారుతీ ప్రవేశపెట్టింది. యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టం (ఏబీఎస్‌), ఎయిర్‌బ్యాగ్స్, బీఎస్‌ -6 ప్రమాణాలు మొదలైనవాటిని తప్పనిసరిగా చేస్తూ ప్రభుత్వం నిబంధనలు విడుదల చేసిన తర్వాత పలు వాహనాల తయారీ సంస్థలు అమ్మకాలు బాగానే ఉన్నా పాత కాలం నాటి మోడల్స్‌ నిలిపివేస్తున్నాయి. 

మారుతి సుజుకితోపాటు ఆటోమొబైల్ సంస్థలు పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్‌ చేసి ప్రవేశపెడుతున్నాయి. ఆ క్రమంలోనే మారుతీ కూడా ప్రస్తుతం కొత్త భద్రతాప్రమాణాలకు అనుగుణంగా కొన్ని మోడల్స్‌ను అప్‌డేట్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్టీపర్పస్‌ వెహికల్‌ ’ఈకో’ వాహనానికి సంబంధించి కొత్త ఫీచర్స్‌తో అప్‌డేటెట్‌ వెర్షన్‌ను ఇటీవలే ప్రవేశపెట్టింది. దీంతో రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్, కో–డ్రైవర్‌ సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ లాంటివి ఈ ఫీచర్లలో ఉన్నాయి. 

ఒకప్పుడు వెలుగువెలిగిన ఓమ్నీ వ్యాన్ ఇక కనుమరుగుకాబోతున్నది. కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ..1984లో దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ వ్యాన్ 35 ఏండ్ల తర్వాత ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ నుంచి వచ్చిన రెండో వాహనం ఇది. మొదటగా 800ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధర తక్కువగా ఉండటం, వినియోగదారులు కోరుకుంటున్న విధంగా ఈ వాహనాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం ఉండటంతో ఎక్కువమంది కస్టమర్లు కొనుగోలు చేశారు. మల్టీ పర్పస్ వాహనమైన ఎకోను ఇటీవల అప్‌డెటేడ్ వెర్షన్ విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే మినీ వ్యాన్‌కు గుడ్‌బై పలుకుతున్నట్లు ప్రకటించడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios