మరో వ్యక్తితో భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

Husband caught his wife with her lover Red handed in hyderabad
Highlights

భార్య అక్రమ సంబంధాలను గుట్టురట్టు చేసిన భార్య

భార్య.. మరో వ్యక్తితో ఉండగా.. భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అంతేకాదు.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పోలీసులకు కూడా పట్టించాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్ గూడలోని జవహర్ నగర్ లో ఓ ఆటో డ్రైవర్ తన భార్యతో కలిసి నివిసిస్తున్నాడు. గత కొంతకాలంగా ఆటో డ్రైవర్ భార్య తమ ఇంటికి సమీపంలోని భీమయ్య అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త.. భార్యను నిలదీయగా.. అలాంటిది ఏమీ లేదంటూ కప్పిపుచ్చింది. కాగా.. పద్ధతి మార్చుకోవాలంటూ భర్త.. ఆమెకు సున్నితంగా హెచ్చరించాడు కూడా.
ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం పనిమీద ఏదో ఊరికి వెళ్లాడు. కాగా.. భర్త ఊళ్లో లేని సమయంలో.. ప్రియుడు భీమయ్యను ఇంటికి పిలిపించుకుంది. అదే సమయంలో పని ముగించుకొని ఇంటికి చేరుకున్న భర్తకు.. భీమయ్య తన భార్యతో ఏకాంతంగా గడుపుతున్న విషయాన్ని గమనించాడు. వెంటనే  పోలీసులకు, చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు.వారి సమక్షంలో భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భీమయ్య ను అదుపులోకి తీసుకున్నారు.

loader