ముద్దు అనేది ప్రేమలో ఒక గొప్ప వ్యక్తీకరణ. ప్రేమికులు, భార్యభర్తల మధ్య ముద్దు ముచ్చట లేకపోతే ప్రేమ అనేది ఉండదు.అయితే..ముద్దు.. కేవలం భార్య భర్తలు, ప్రేమికుల మధ్య  మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటు. ముద్దులో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా..? వాలంటైన్స్ వీక్ స్పెషల్ లో భాగంగా ఈ రోజు కిస్ డే. అందుకే.. ముద్దు ముచ్చట్ల గురించి ప్రస్తావన తీసుకువచ్చాం. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. కేవలం ముద్దు పెట్టడం వల్ల.. కొందరు సెలబ్రెటీలు.. వార్తల్లోకి ఎక్కారు. ఆ సెలబ్రెటీలు ఎవరు..? ఎవరికి ఘాటైన ముద్దు ఇచ్చి వార్తల్లోకి ఎక్కారో ఇప్పుడు చూద్దాం.

1.పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంట. ప్రముఖ పాప్ సింగర్స్ బ్రిట్ని స్పియర్స్, మడన్నా. వీరిద్దరూ 2003లో న్యూయార్క్ లో రెడియో సిటీ నిర్వహించిన ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని ఇలా లిప్ లాక్ ఇచ్చుకున్నారు. అప్పట్లో ఇదో పెద్ద సంచలనం. ఇద్దరు అమ్మాయిలు ఇలా అందరి ముందు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం  సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

2. ఇక ఈ రెండో  ఫోటోలో ఉన్నది. బ్రిటన్ రాజకుమారుడు విలియమ్స్, అతని భార్య కాథరిన్. వీరిద్దరూ వివాహం తర్వాత ఒకరినొకరు ముద్దాడారు. రాజకుటుంబం అందరి ముందు వీరు ఇలా చేయడం చర్చనీయాంశంగా మారింది.

3. ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరూ అమెరికన్ నటీనటులు. షరోన్ అనే నటి.. రిచర్డ్ అనే నటుడిని ముద్దాడింది. అతను ఆమె అందనంత దూరంలో ఉన్నప్పటికీ.. చాలా కష్టపడి మరీ కిస్ చేసింది. ఈ చిత్రాన్ని మీడియా క్లిక్ మనిపించడంతో.. సంచలనంగా మారింది.

4. పై ఫోటోలో కనిపిస్తున్నది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియా. ఓహియోలో ట్రంప్ తన మద్దతుదారులతో చేపట్టిన ర్యాలీ సమయంలో పెట్టిన ముద్దు ఇది. ట్రంప్ ఏది చేసినా సంచలనమే కదా. ఇది కూడా అదేవిధంగా సంచలనమైంది.

5. ఈ పై ఫోటోలో బెస్ట్ మేల్ ఆస్కార్ అవార్డు అందుకున్న ఆనందంలో ఆండ్రియన్ బ్రాడీ.. అవార్డు అందజేసిన హాలీ బెర్రీ ఇలా కిస్ చేశాడు.

6. పై ఫోటోల ఉన్నది ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంట. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, అందాల తార దీపికా పదుకొణె. వీరిద్దరూ కలిసి నటించిన ‘ హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో షారూక్ ..దీపికాని కిస్ చేశాడు. ఈ ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయ్యింది.

7. ఈ ఫోటోలో బాలీవుడ్ తార శిల్పా శెట్టిని ముద్దు పెడుతున్న నటుడు రిచర్డ్ గెరీ.  ఢిల్లీలో నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమానికి ప్రమోట్ చేయడానికి వస్తే.. రిచర్డ్.. ఇలా శిల్పాని గట్టిగా బంధించి ముద్దు పెట్టాడు.

8. ఈ పై ఫోటోలో కనిపిస్తుంది బాలీవుడ్ నూతన దంపతులు కరణ్ సింగ్ గ్రోవర్, బిపాషా బసు. బిపాషా పుట్టిన రోజు వేడుకలో కరణ్.. ఇలా కిస్ చేస్తూ కెమేరా కన్నుకి చిక్కారు.

9. ఈ ఫోటోలో షారూఖ్ ని కిస్ చేస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా?.. మరెవరో కాదు బాలీవుడ్ నటి అనుష్క శర్మ. వీరిద్దరూ కలిసి నటించిన ‘రబ్ నే బనాదీ జోడీ’ చిత్ర ప్రమోషన్స్ లో అనుష్క.. షారూక్ ని కిస్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది.