సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం..

Girls stripped in Sagar hostel probe ordered
Highlights

అమ్మాయిలను వివస్త్రలను చేసిన వార్డెన్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్శిటీలో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్ వార్డెన్.. విద్యార్థినులను వివస్త్రలను చేసి.. దారుణంగా ప్రవర్తించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ లోని సాగర్ పట్టణంలో హరిసింగ్ గౌర్ సెంట్రల్ యూనివర్శిటీ ఉంది. దీనిని సాగర్ యూనివర్శిటీ అని కూడా పిలుస్తారు. వర్శిటీ ఆవరణలో లక్ష్మీబాయి హాస్టల్ లో 40మందికి పైగా విద్యార్థినులు ఉంటున్నారు. శనివారం హాస్టల్ ని చెక్ చేయడానికి వచ్చిన వార్డెన్ కి.. ఒక గదిలో వాడిన శానిటరీ నాపికిన్స్ కనిపించాయి. దీంతో.. ఆగ్రహించిన వార్డెన్.. విద్యార్థినుల పట్ల దారుణంగా ప్రవర్తించింది. హాస్టల్ లోని అమ్మాయిలు అందరినీ ఒక చోట నిలబెట్టి వారిని వివస్త్రలను చేసింది. ఆ శానిటరీ నాపికిన్స్ అక్కడ ఎవరు పడేశారో చెప్పాలంటూ.. విద్యార్థినుల లోదుస్తులు సైతం చెక్ చేయడానికి ప్రయత్నించింది.

వార్డెన్ ప్రవర్తించిన తీరును విద్యార్థినులు జీర్ణించుకోలేకపోయారు. కన్నీరు పెడుతూ.. వార్డెన్ పై వీసీకి ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని వీసీ తివారి తెలిపారు.

loader