న్యూఢిల్లీ: పండగ సీజన్‌లో కార్లపై కస్టమర్లకు ఇస్తున్న ఆఫర్లు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని, ఈ నెల తర్వాత ఈ ఆఫర్లు తగ్గే అవకాశం ఉందని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఈ స్థాయిలో డిస్కౌంట్లను భరించే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.

మారుతి సుజుకి తన కార్లపై నగదు డిస్కౌంట్లతోపాటు కొన్ని మోడళ్లపై మరింత ఎక్కువ వారంటీలను ఇస్తోంది. దీని మూలంగా గత సెప్టెంబర్ నెలలో కంపెనీ అమ్మకాలు అంతకు ముందు జూలై, ఆగస్టుతో పోల్చితే 18-20 శాతం మేర పెరిగాయి.

ఆఫర్ల ద్వారా మార్కెట్‌ పునరుజ్జీవం కోసం ప్రయత్నం చేశామని, ఇలాంటి ప్రోత్సాహకాలను ఎక్కువ కాలం కొనసాగించలేమని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ అన్నారు. రానున్న కాలంలో ఈ ఆఫర్లు తగ్గడానికి అవకాశం ఉందని చెప్పారు.

గత ఏడాది నవరాత్రితో పోల్చితే ఈసారి నవరాత్రి సందర్భంగా బుకింగ్స్‌ బాగున్నాయని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ తెలిపారు. డీజిల్‌ మోడళ్లతోపాటు బీఎస్‌-6 ప్రమాణాలతో వచ్చిన ఎనిమిది కార్లు అమ్మకాల వృద్ధికి దోహద పడినట్టు చెప్పారు.

ఇటీవలే విడుదల చేసిన ఎస్‌-ప్రెసో మోడల్‌కు 10,000కు పైగా బుకింగ్స్‌ వచ్చాయని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ తెలిపారు. బీఎస్‌-6 మోడళ్లు వచ్చిన నేపథ్యంలో బీఎస్‌-4 మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసినట్టు ఆయన చెప్పారు.

విటారా, ఎస్-క్రాస్ మోడల్ కార్ల పెట్రోల్ వేరియంట్ల ఆవిష్కరణకు ప్రణాళికలు రూపొందించామని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఇప్పటికే డీజిల్ నుంచి పెట్రోల్ వైపు అన్ని మోడళ్లను మార్చేస్తున్నది మారుతి సుజుకి. అయితే ఈ రెండు కార్ల పెట్రోల్ వేరియంట్లను ఎప్పుడు విపణిలోకి ఆవిష్కరిస్తామన్న సంగతిని వెల్లడించలేదు.