ఎన్టీఆర్‌ను తలపిస్తున్న జగన్ పాలన...: మంత్రి అనిల్

వైఎస్ జగన్ పాలన  దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైెఎస్సార్ ను పోలి వుందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ముగ్గురివి ప్రజా ప్రభుత్వాలను  ప్రశంసించారు. 

minister anil kumar yadav praises ys jagan governance

అమరావతి: నెల్లూరు పట్టణాన్ని ప్రణాళికాబద్దంగా అబివృద్ది చేయడానికి చర్యలు తీసకుంటున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఏపీ జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. మరో నెలరోజుల్లో మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇలా కేవలం నగరంలోనే కాకుండా జిల్లా మొత్తంలో అభివృద్ది కార్యక్రమాలు చురుగ్గా సాగనున్నాయని మంత్రి తెలిపారు. 

శనివారం మంత్రి అనిల్ తన సొంత నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న మౌళిక వసతుల గురించి తెలుసుకున్నారు. వీటికి సంబంధించి అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. 

ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక వసతులు ఏర్పాటు కోసం రూ.20 కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తయారు చేస్తామని... ఇప్పటికే నాడు నేడు కార్యక్రమం కింద ప్రణాళికలు  సిద్దం చేసినట్లు తెలిపారు.

read more  తండ్రి కోసమే విశాఖకు రాజధానిని తరలిస్తున్న జగన్: దేవినేని ఉమ

నెల్లూరులోని దేవాలయ భూములను పరిరక్షిస్తామన్నారు. ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు నేతలు కలిపి పరిపాలిస్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి పాలన అలా వుందన్నారు. 

దిశ చట్టం ఓ చరిత్రాత్మక నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు. మహిళా రక్షణకు ప్రభుత్వం కట్టుబడి వుందని... అందుకోసమే వారికి సత్వరన్యాయం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిలో దిశ చట్టం భయాన్ని రేకెత్తిస్తోందన్నారు. 

వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. అమరావతిని అడ్డం పెట్టుకొని టీడీపి నేతలు ఇప్పటికే చాలా దోచుకున్నాకని...  ఇఖపై కూడా దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 

read more  మౌనిక మృతి కేసు: బావలు శారీరకంగా, అన్నలు మానసికంగా...

ప్రతిపక్ష నేత చంద్రబాబు తన ఇంట్లో కుక్క చనిపోయిన జగన్మోహన్ రెడ్డే కారణమని రాజకీయం చేస్తాడని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా  ముఖ్యమంత్రి ముందుకు పోతున్నారని... రాజదాని కోసం ఏర్పాటుచేసిన కమిటిలో మంచి నిపుణులున్నారని అన్నారు. గతంలో టిడిపి ఏర్పాటుచేసిన రాజదాని కమిటి లో కేవలం వ్యాపారులు మాత్రమే ఉన్నారని మంత్రి అనిల్ గుర్తుచేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios