భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్ ను పోలీసులు అరెస్టు చేశారు. భార్య మృతికి అతడే కారణమని ఆరోపణలు రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ముంబైలోని బందూప్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

తమ అమ్మాయి ఇది ఆత్మహత్య కాదు, హత్యేనని బాధితురాలి తల్లి, సోదరి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ  ఆరోపణల నేపథ్యంలో అతడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... జితేంద్ర,  కోమల్ అగర్వాల్ భార్య భర్తలు. వీరు ముంబై లో నివసిస్తున్నారు. భర్త జితేంద్ర ప్రముఖ యూట్యూబర్.  అతడి ఛానల్ పేరు ‘జిత్ జాన్’.  అయితే ఇటీవల భార్య కోమల్ ఫ్యానుకు  ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమల్ ది ఆత్మహత్య కాదు, సత్యం అని ఫిర్యాదు చేయడంతో జితేంద్ర ను పోలీసులు అరెస్టు చేశారు.

‘అక్కను మానసికంగా, శారీరకంగా జితేంద్ర వేధింపులకు గురి చేసే వాడు. రెండు, మూడు సార్లు నన్ను కూడా వేధించాడు. కొంతమంది స్నేహితురాళ్లను కూడా వేధించాడు. తట్టుకోలేక ఒకసారి అక్క ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది కూడా.  అతడి వేధింపులతో నే అక్క మరణించింది. అతడి పై చర్యలు తీసుకోవాలి’ కోమల్ సోదరి ప్రియా తెలిపింది. కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.