న్యూఢిల్లీ: తాను జన్మనిచ్చిన కొడుకుని ఉన్నత స్థానం చేర్చేందుకు నిచ్చెనవుతాడు. బిడ్డల భవితకోసం నిత్యం పరితపిస్తాడు. కష్టకాలంలో కంటిపాపై, అవసర సమయాన ఆపన్నహస్తమై, అనుక్షణం తను వాళ్ళ క్షేమానికై ఆరాటపడతాడు. 

అల్లారుముద్దుగా పెంచి ఆటపాటలతో పాటుగా, ఆత్మస్థైర్యమూ నేర్పిస్తాడు. బడిలో గురువులు పాఠాలు నేర్పిస్తే బతుకు పోరాటం నేర్పించే గురువు. బిడ్డల లోపాలు సరిచేసి వారి భవితకు చక్కటి పునాది వేస్తాడు తండ్రి. 

అలాంటి తండ్రి పట్ల ఓ దుర్మార్గుడు అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. క్షణికావేశంలో తనను భుజాలపై ఎత్తుకుని ఆడించిన తండ్రి భుజాలను నరికేశాడు. గుండెలపై బొజ్జో పెట్టుకుని లాలిపాట పాడిన తండ్రి గుండెను కోసి సభ్యసమాజానికే మాయని మచ్చలా మారాడు ఓ దుర్మార్గుడు. 

అందర్నీ కలచివేస్తున్న ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. తండ్రీ కొడుకుల నెలకొన్న వాగ్వాదం పెద్ద గొడవకు దారి తీసింది. ఆవేశంలో కన్న తండ్రి అన్న మమకారం చూడకుండా అత్యంత పాశవికంగా ముక్కలుముక్కలుగా నరికేశాడు. 

వివరాల్లోకి వెళ్తే తూర్పు ఢిల్లీలో ఓ కుటుంబం ఉంంది. ఆ దంపతులు ఇద్దరు కుమారులతో జీవించేవారు. జీవనోపాధి కోసం పెద్దకుమారుడు, తల్లి మనాలి వెళ్లిపోయారు. చిన్నకుమారుడు తండ్రితో కలిసి తూర్పుఢిల్లీలోనే ఉంటున్నాడు. 

కుమారుడు ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ విషయంపై తండ్రి నిత్యం మందలిస్తూనే ఉన్నాడు. బుధవారం కూడా తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. కొడుకు జులాయిగా తిరుగుతుండటంతో తట్టుకోలేని ఆ తండ్రి కొడుకు భవిష్యత్ కోసం తిట్టాడు. 

తండ్రిమాటలతో కోపోద్రిక్తుడైన ఆ యువకుడు తండ్రిపై పిడిగుద్దెల వర్షం కురిపించాడు. దెబ్బలు తాళలేక ఆ తండ్రి మరణించాడు. తండ్రి చనిపోవడంతో శవాన్ని ఏం చేయాలో తోచక స్నేహితుడికి ఫోన్ చేశాడు. స్నేహితుడి సాయంతో మృతదేహాన్ని 25 ముక్కలుగా నరికారు. 

చికెన్ సెంటర్ లో లభించే ప్లాస్టిగ్ బ్యాగులు కొనుగోలు చేసి తండ్రి శరీరంలోని ఒక్కోభాగాన్ని ఒక్కో సంచిలో సర్ధి దాచేశారు. ఇదంతా డీసీపీ కార్యాలయానికి 300 మీటర్ల దూరంలో జరగడం విశేషం. 

అర్థరాత్రి యువకుడు ఇంట్లో నుంచి పెద్ద గొడవ కావడం, అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.