పెళ్లిలో డ్యాన్స్ వేస్తూ ఓ యువకుడు హఠాన్మరణం పొందాడు. అప్పటి వరకు హుషారుగా డ్యాన్స్ వేసిన ఆ కుర్రాడు.. ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. పెళ్లికి వచ్చినవారంతా విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా పరిధిలో గల సరంగ్‌బుదియా ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సరంగ్ బుదియా ప్రాంతానికి చెందిన వికాస్ అగర్వాల్ చిన్నపాటి బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఇంటి ఎదురు గా ఉండే వ్యక్తికి వివాహం నిశ్చయమైంది. కాగా.. స్నేహితులతో కలిసి పెళ్లిలో డ్యాన్స్  చేశాడు. అదిపోయే స్టెప్పులు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు.

Also Read నా కన్నా గొప్పవాడు లేడు.. ఎంపీ సన్నీడియోల్ షాకింగ్ కామెంట్స్...

వికాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరిశీలించి, అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కాగా సీతామడి ప్రాంతంలో వికాస్ కిరాణా దుకాణం నిర్వహించేవాడు. కాగా.. డ్యాన్స్ చేస్తూ పడిపోయాడని.. పైకిలేపడానికి చాలా ప్రయత్నించామని.. అయినా అతను లేవలేకపోయాడని వారు చెప్పారు. 

వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినా పెద్ద లాభం ఏమీలేదని చెప్పారు. ఈ విషయం గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. వారు వచ్చి సంఘటానస్థలిని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.