మతం మార్చుకోవాలంటూ ఓ యువకుడిపై ఓ ముఠా దాడి చేసింది. ఈ సంఘటన హరియాణాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... పిన్‌గావ్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని రిఠ్ఠ్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.  మ‌తం మార్చుకోవాలంటూ ఒక వ్య‌క్తిపై  కొంతమంది సామూహికంగా దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

పిన్‌గావ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి చంద్రభాన్ మాట్లాడుతూ రిఠ్ఠ్‌ గ్రామానికి చెందిన పప్పు... అదే గ్రామానికి చెందిన ముంతాజ్ చాలాకాలంగా మతం మార్చుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నార‌ని ఫిర్యాదు చేశార‌ని తెలిపారు. దీనిని ప‌ప్పూ వ్యతిరేకించ‌గా ప్రధాన నిందితురాలితో సహా 14 మంది అతన్ని కర్రల‌తో కొట్టారు. అలాగే మతం మార్చుకోక‌పోతే చంపేస్తామ‌ని బెదిరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేశారు.